నటుడు శ్రీకాంత్ కెరీర్ ఆరంభంలో విలన్ గా కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ ఆ తరువాత హీరోగా అవకాశాలు రావడంతో విలన్ రోల్స్ కి గుడ్ బై చెప్పేశాడు. లవ్ స్టోరీస్, కుటుంబ కథా చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించాడు శ్రీకాంత్. హీరోగా అతడి సాఫ్ట్ ఇమేజ్ వచ్చేసింది. అలాంటి నటుడుని ‘అఖండ’ సినిమాలో చాలా వయొలెంట్ గా చూపించాడు దర్శకుడు బోయపాటి. హీరోగా అవకాశాలు తగ్గడంతో శ్రీకాంత్ కూడా విలన్ గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
‘యుద్ధం శరణం’ సినిమాతో విలన్ గా మారాడు శ్రీకాంత్. కానీ ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు ‘అఖండ’ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ మలుపు తిరుగుతుందని అనుకున్నారు. కానీ ఇది కూడా వర్కవుట్ అయ్యేలా లేదు. సినిమాలో శ్రీకాంత్ ఎంత బాగా నటించినా.. ఆ పాత్ర పెద్దగా పండలేదు. ఇంటర్వెల్ సీన్ కి బాలయ్య-శ్రీకాంత్ మధ్య నడిచే డైలాగ్స్ వార్ ఆకట్టుకున్నప్పటికీ.. తరువాత మొత్తం కూడా నార్మల్ గా సాగిపోతుంది.
మెయిన్ విలన్ గా మరో వ్యక్తి ఉండడంతో.. ఆ పాత్రతోనే క్లైమాక్స్ ప్లాన్ చేయడంతో.. శ్రీకాంత్ క్యారెక్టర్ ను ముందే చంపేశారు. దీంతో శ్రీకాంత్ పాత్ర అర్ధాంతరంగా ముగిసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఆశించిన స్థాయిలో శ్రీకాంత్ పాత్ర ఇంపాక్ట్ చూపించలేకపోయింది. మరి ఫ్యూచర్ లో శ్రీకాంత్ కోసం విలన్ క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారో లేదో డౌటే..!