Srikanth: దేవర మూవీలో శ్రీకాంత్ రోల్ ఇదే.. మలుపు తిప్పుతాడంటూ?

బాహుబలి సినిమాకు కట్టప్ప రోల్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా సక్సెస్ కుసత్యరాజ్ పోషించిన కట్టప్ప పాత్ర కీలకం కాగా దేవర సినిమాలో శ్రీకాంత్ పాత్ర సైతం అదే స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. దేవర సినిమాలో తారక్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన లుక్ తండ్రి పాత్రకు సంబంధించిన లుక్ అని తెలుస్తోంది. శ్రీకాంత్ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్ కానుందని ఈ పాత్ర ద్వారా ఫ్లాష్ బ్యాక్ రివీల్ కానుందని సమాచారం.

దేవర సినిమాలో మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తున్న (Srikanth) శ్రీకాంత్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. ఈ సినిమా రిలీజ్ కు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్య కాలంలో చెప్పిన తేదీకి రిలీజవుతున్న భారీ బడ్జెట్ మూవీ దేవర మాత్రమే కావడం గమనార్హం. సరైన ప్రణాళికలతో సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయి హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. దేవర సినిమాపై అంచనాలు పెరుగుతుండగా సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకు ప్లస్ కానుందని సమాచారం అందుతోంది.

దేవర సినిమా సోలో హీరోగా  ఎన్టీఆర్ మార్కెట్ ను మరింత పెంచే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవర సినిమాకు సంబంధించి ప్రతి విషయంలో ఒకటికి రెండుసార్లు తారక్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాతలలో ఒకరిగా ఉన్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus