‘బాహుబలి'(సిరీస్) కు కట్టప్ప పాత్ర చాలా కీలకమైనది. ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్న దేశమంతా పాపులర్ అయ్యింది. కట్టప్ప బాహుబలికి విధేయుడిగా ఉంటూనే అతన్ని హతమారుస్తాడు. అలా అని కట్టప్ప బ్యాడ్ పర్సన్ కాదు. మళ్ళీ బాహుబలి కుటుంబాన్ని చేరదీసి ప్రత్యర్థి కుటుంబాన్ని హతమార్చేందుకు కారణమవుతాడు. అలాంటి కట్టప్ప పాత్ర … చరణ్- శంకర్ సినిమాలో కూడా ఉంటుందట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి కైరా అద్వానీ హీరోయిన్ గా ఎంపికైంది.
అంజలి, సునీల్, జయరాం, శ్రీకాంత్ అబ్బో ఇలా లెక్కలేనంత మంది ఆర్టిస్ట్ లు ఈ మూవీలో నటిస్తున్నారు.అయితే కథని మొత్తం మలుపు తిప్పేది మాత్రం శ్రీకాంత్ పాత్రేనట. ఈ సినిమాలో అతను ఓ `కట్టప్ప` లా కనిపిస్తాడు అనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.అంతేకాదు ఈ సినిమాలో చరణ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు అని కూడా తెలుస్తుంది. తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు అనేది మరో సమాచారం. రెగ్యులర్ సినిమాల మాదిరే తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది.
ఆ టైములో చరణ్- శ్రీకాంత్ మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి రాజకీయ పార్టీ పెడతారు ‘భరత్ అనే నేను’ స్టైల్లో.! కానీ కొన్ని కారణాల వల్ల చరణ్ ను వెన్నుపోటు పొడుస్తాడు శ్రీకాంత్. తర్వాత అతను ముఖ్యమంత్రి అవుతాడట. అలా అని శ్రీకాంత్ బ్యాడ్ పర్సనా? అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేము. మెయిన్ విలన్ గా ఎస్.జె.సూర్య నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీకాంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని.. లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే..!