Srikanth: విడాకులంటూ బ్రేకింగ్ న్యూస్ వేశారు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో శ్రీకాంత్ ఒకరు ఈయన ఎన్నో కుటుంబ కథ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా సినిమాలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం ఈయన టాలీవుడ్ అండ్ హీరోల సినిమాలలో వారికి బాబాయ్ అన్నయ్య పాత్రలలో నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల ఈయన కోటబొమ్మాలి పిఎస్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ తన కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీకాంత్ ను యాంకర్ ప్రశ్నిస్తూ గత కొద్ది రోజుల క్రితం ఒక వేదికపై రాశి మిమ్మల్ని కొట్టింది ఎందుకు కొట్టింది అసలేం జరిగింది అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం చెబుతూ ఒక సినిమా వేడుక కోసం మేమిద్దరం ఒకే చోట కలిశామని శ్రీకాంత్ తెలిపారు. అయితే ఆ సమయంలో ఆ సినిమా హీరోయిన్ అక్కడికి వచ్చి రాశిని చూసి అమ్మ అంటూ పిలిచింది. ఆమె అలా పిలిచేసరికి నాకు నవ్వు ఆగలేదు అందుకే నేను కూడా రాశిని సరదాగా ఆటపట్టించడం కోసం అమ్మ అంటూ పిలిచాను.

ఇలా తనని అమ్మ అని పిలిచేసరికి ఆమె నన్ను కొట్టింది అంటూ శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక గతంలో మీరు చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడపారు అంటూ కూడా వార్తలు వచ్చాయి దీనిపై మీ అభిప్రాయం అంటూ శ్రీకాంత్ అయింది ఈ ప్రశ్నకు ఆయన నవ్వేసి ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి అంటూ మాట్లాడారు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలను అందుకుంటున్నటువంటి శ్రీకాంత్ (Srikanth) బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తే నటిస్తారా అన్న ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం వచ్చిన నటిస్తానని తెలిపారు. ఇక విడాకుల గురించి కూడా ప్రశ్నలు ఎదురు కావడంతో ఆ రోజు నేను ఊహ ఇద్దరు కలిసి అరుణాచలం వెళ్తున్నాము. అయితే న్యూస్ లో శ్రీకాంత్ ఊహ విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యానని వెంటనే ఈ వార్తలను ఖండిస్తూ పోస్ట్ చేశానని శ్రీకాంత్ విడాకుల రూమర్లపై కూడా క్లారిటీ ఇచ్చారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus