నేషనల్ అవార్డు కొడితే ఇంత చర్చ నడుస్తుందేంటి?

నిన్న కేంద్ర ప్రభుత్వం 67 వ జాతీయ అవార్డులను ప్రకటించింది. 2019 వ సంవత్సరానికి గాను ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ‘జెర్సీ’ ‘మహర్షి’ చిత్రాలకు నేషనల్ అవార్డులు దక్కడం విశేషం. ‘మహర్షి’ కి 2 అవార్డులు, ‘జెర్సీ’ రెండు అవార్డులు దక్కాయి. అయితే ‘జెర్సీ’ చిత్రానికి అవార్డు దక్కడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ‘మహర్షి’ చిత్రానికి నేషనల్ అవార్డులు రావడం పై కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు 25వ చిత్రమైన ‘మహర్షి’ 2019వ సంవత్సరం మే 9న విడుదలైంది.

మొదటి షోతోనే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది. ‘శ్రీమంతుడు’ ‘3 ఇడియట్స్’ ‘సర్కార్’ వంటి చిత్రాలను మిక్స్ చేసినట్టు ఉంది అని క్రిటిక్స్ సైతం ‘మహర్షి’ పై విమర్శలు గుప్పించారు.మహేష్ బాబు కాలర్ ఎగరేస్తే.. ట్రోల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సినిమా క్లైమాక్స్ లో ‘వీకెండ్ అగ్రికల్చర్’ గురించి మెసేజ్ ఇచ్చారు. కానీ దీనిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు లేరు. ‘శ్రీమంతుడు’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం.. తరువాత ఎంతో మంది పెద్దలు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి తమ వంతు సాయం చెయ్యడం జరిగింది.

మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ వంటి వారు కూడా గ్రామాలను దత్తత తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఆ చిత్రానికి నేషనల్ అవార్డు ఎందుకు రాలేదు? ‘మహర్షి’ కే ఎందుకు వచ్చింది. ‘శ్రీమంతుడు’ కంటే కూడా ‘మహర్షి’ తోపా? అనే కామెంట్లతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏమైతేనేం… ఓ తెలుగు సినిమాకి.. అదీ మహేష్ బాబు 25వ సినిమాకి 2 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఇది సంతోషించతగిన విషయమే కదా..!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus