‘కేజీఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీనిధి శెట్టి. తొలి సినిమాతోనే పెద్ద హిట్ అందుకుంది. ‘కేజీఎఫ్’ పార్ట్ 1 కంటే పార్ట్ 2తో ఆమెకి మంచి పేరొచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు రావడంతో ఆమెకి ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. కన్నడకి చెందిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు, హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు షురూ చేసింది.
కానీ ఆమె ఆశిస్తున్న రేంజ్ లో ఛాన్స్ లు మాత్రం రావడం లేదు. దానికి కారణం.. ఈ బ్యూటీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే. ‘కేజీఎఫ్’ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి కొందరు నిర్మాతలు తమ సినిమాల్లో శ్రీనిధిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో ఆమెని సంప్రదించగా.. ఒక్కో సినిమాకి రెండు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ షాక్ ఇస్తుందట. ఇటీవల ఓ టాలీవుడ్ ప్రొడ్యూసర్ తన సినిమాలో నటించమని అడగ్గా..
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తీసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అడిగిందట శ్రీనిధి శెట్టి. దీంతో సదరు నిర్మాత మరో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి వచ్చేశారట. ఈ కారణంగానే నిర్మాతలు ఆమెని హీరోయిన్ గా తీసుకోవడం లేదని టాక్. అయితే శ్రీనిధి మాత్రం రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని అనుకోవడం లేదు.
తనకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు ఉందని.. కాబట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో తప్పు లేదని ఫీలవుతోంది. ఆమె ఆశించడంలో తప్పు లేదు కానీ అంత పారితోషికం ఇచ్చే నిర్మాతలు కూడా ఉండాలి కదా..? శ్రీనిధి ఇన్ని కోట్లు కావాలని ఫిక్స్ అయి ఉంటే మాత్రం అవకాశాలు రావడం కష్టమే!