cఅవి ఒకటి యష్ అయితే మరొకటి శ్రీనిధి శెట్టి. అవును కే.జి.ఎఫ్ 1 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన యష్,శ్రీనిధి శెట్టి ఇద్దరు ఎంతో మంచి గుర్తింపును సంపాదించారు. ఆ తర్వాత వచ్చిన కే.జీ.ఎఫ్ 2 సినిమా కూడా వీరికి స్టార్డమ్ ని తెచ్చి పెట్టడంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ కి వెళ్ళిపోయారు.
అయితే ఇంత రేంజ్ అందుకున్నప్పటికీ శ్రీనిధి శెట్టికి మరో అవకాశం రావడం లేదు. ఆమెకు ఇతర అవకాశాలు రాకపోవడం బాధాకరం. తాజాగా శ్రీనిధి శెట్టి సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది అంటూ నెట్టింట్లో ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీనిధి తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటోలు నుదుటిన బొట్టు పెట్టుకొని కనిపిస్తోంది.
అయితే ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్స్ ఏంటి శ్రీనిధి శెట్టి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది గా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే దీని గురించి తెలిసిన కొంతమంది కర్ణాటక వాళ్ళు అలాంటిదేమీ లేదు కర్ణాటకలోని ఒక కులానికి చెందిన కొంతమంది యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కూడా ఇలా పెళ్లి కాకుండానే నుదుటన బొట్టు పెట్టుకుంటారుట.
ఇది ఆచారంలో ఒక భాగమే అని టాక్.అందుకే (Srinidhi Shetty) శ్రీనిధి శెట్టి కూడా అలా నుదుటన బొట్టు పెట్టుకుందని సమాచారం.అంతేగాని ఆమె ఎలాంటి పెళ్లి చేసుకోలేదు అంటూ క్లారిటీ ఇస్తున్నారు.మరి ఇది నిజమేనా కాదా అని అందరూ అయోమయంలో పడిపోయారు.