Srinu Vaitla: ఆ హీరో సినిమాతో శ్రీనువైట్ల సక్సెస్ సాధిస్తారా?

గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న డైరెక్టర్లలో శ్రీనువైట్ల ఒకరు. ఒకప్పుడు కామెడీ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు సైతం శ్రీనువైట్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచాయి.

ఈ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు సైతం భారీ మొత్తంలో నష్టాలు మిగిలాయి. కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకున్న శ్రీను వైట్ల వరుస ఫ్లాపులకు వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కూడా కారణమని కొంతమంది భావిస్తారు. అయితే ఈ డైరెక్టర్ కు గోపీచంద్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీను వైట్ల డైరెక్టర్ గా ప్రముఖ రచయితలలో ఒకరైన గోపీ మోహన్ రాసిన కథ గోపీచంద్ కు ఎంతగానో నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బోగట్టా.

Finally Srinu Vaitla To Work With Him1

అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరనే క్లారిటీ రావాల్సి ఉంది. గోపీచంద్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. గోపీచంద్ ఇచ్చిన అవకాశాన్ని అయినా శ్రీను వైట్ల సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మంచు విష్ణు శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఢీ మూవీ సీక్వెల్ కు సంబంధించిన ప్రకటన వెలువడి కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. పరిమిత బడ్జెట్ తోనే శ్రీను వైట్ల గోపీచంద్ కాంబో సినిమా తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. ఈ మధ్య కాలంలో గోపీచంద్ కెరీర్ కూడా ఆశాజనకంగా లేదనే సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus