Hi Nanna: ‘హాయ్ నాన్న’ కోసం శృతి హాసన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

  • November 25, 2023 / 12:20 PM IST

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ మూవీ డిసెంబర్ 7న విడుదల కానుంది.సౌర్యవ్ అనే నూతన దర్శకుడు తీసిన సినిమా ఇది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా కనిపించింది. తండ్రీ కూతుళ్ళ మధ్య ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ రూపొందింది. హేషమ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అన్ని విధాలుగా ఆకట్టుకునేలా కనిపిస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ గా మృణాల్ కనిపిస్తున్నప్పటికీ..

నాని భార్య పాత్రలో శృతి హాసన్ నటిస్తున్నట్టు టాక్ నడిచింది. నిజంగా నాని భార్యగా కనిపిస్తుందా లేదా అన్నది క్లారిటీ ఇవ్వలేదు కానీ, ఆ పాపకి తల్లి పాత్రలో కనిపించబోతుంది అనే టాక్ మాత్రం నడుస్తుంది. అది చిన్న పాత్రే. శృతి హాసన్ నుండి పది రోజుల కాల్ షీట్లు కూడా తీసుకోలేదు అని ఇన్సైడ్ టాక్. ‘కాక్ టైల్’ అనే పార్టీ సాంగ్ లో శృతి కనిపించబోతుంది అని కూడా తెలుస్తుంది.

అయినప్పటికీ (Hi Nanna) ‘హాయ్ నాన్న’ సినిమా కోసం శృతి హాసన్ ఏకంగా రూ.1.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు సమాచారం. పోటీగా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ శృతి హాసన్ కి ఈ రేంజ్ డిమాండ్ ఉండటం అనేది చిన్న విషయం కాదు అనే చెప్పాలి. ప్రస్తుతం ఈమె ప్రభాస్ ‘సలార్’ మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమాకు కూడా గట్టిగా అందుకున్నట్టు తెలుస్తుంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus