ప్రముఖ సినీ నటుడు జగపతిబాబు రీసెంట్ గా కులంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇంట్లో పనిచేసే వాళ్లకు కులం అవసరం లేదని.. ఆడదాని దగ్గర పడుకోవడానికి కులం అవసరం లేదని.. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మాత్రం కులం చూస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగపతి బాబు పెద్ద కూతురు ఒక విదేశీయుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె పెళ్లి సమయంలో తన కుల పెద్దల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు జగపతి బాబు.
ఇప్పటికీ ఆ కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. ఇదిలా ఉండగా.. తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా కులం గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ అయింది. ఇండియాలో ఉన్న కుల వ్యవస్థ గురించి హాలీవుడ్ మీడియా రాజమౌళిని ప్రశ్నించింది. దానికి ఆయన.. మా కుటుంబ సభ్యులు కుల వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పారు. కాలేజీకి వెళ్లే వరకు తన కులం ఏంటో తనకు కూడా తెలియదని రాజమౌళి అన్నారు. కాలేజ్ లో అప్లికేషన్ ఫామ్ నింపడానికి తన తండ్రి వచ్చారని..
కులం గురించి అప్లికేషన్ లో ఒక కాలమ్ ఉందని రాజమౌళి అన్నారు. అది పూరించడానికి తన తండ్రి నిరాకరించారని.. కుల వ్యవస్థ గురించి తనకు అప్పుడే తెలిసిందని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకు రాజమౌళి ఎప్పుడూ కూడా కుల వ్యవస్థ గురించి బహిరంగంగా మాట్లాడలేదు.
తొలిసారి ఆయన ఇలా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం రాజమౌళి తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. మహేష్ బాబు హీరోగా జేమ్స్ బాండ్ తరహాలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?