గుండెపోటుతో కోలీవుడ్ నటుడు మృతి!

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు ఆర్ఎన్ఆర్ మనోహర్(61) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కోలీవుడ్ బారిన పడిన ఆయన్ను చెన్నైలోని ప్రయివేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనాకి చికిత్స అందిస్తున్న సమయంలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. దీంతో తమిళ ఇండస్ట్రీలో విషాదఛాయలు నెలకొన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టిన మనోహర్ అగ్ర దర్శకుల వద్ద పని చేశారు.

కో డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలకు పని చేశారు. ఆ తరువాత నటుడిగా మారారు. 1995లో ‘కోలంగళ్’ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘దిల్’, ‘తెన్నవాన్’, ‘వీరమ్’, ‘సలీమ్’, ‘ఎన్నై అరిందాల్’, ‘నానుమ్ రౌడీ దాన్’, ‘వేదాలం’, ‘విశ్వాసం’, ‘కాంచన -3’, ‘అయోగ్య’ లాంటి చిత్రాల్లో నటుడిగా మెప్పించారు.2009లో వచ్చిన ‘మాసిలమణి’ అనే సినిమాతో దర్శకుడిగా మారారు మనోహర్. తొలిసినిమాతోనే హిట్ అందుకున్నారు.

కానీ తన దృష్టి మొత్తం నటనపైనే పెట్టారు. నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.