బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) తమ్ముడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan) అందరికీ సుపరిచితమే. హీరోగా ఇతను నిలదొక్కుకోలేదు. నెగిటివ్ రోల్స్ తోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. నటి మలైకా అరోరాని (Malaika Arora) ఇతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే తర్వాత మనస్పర్థల కారణంగా ఆమెతో విడాకులు తీసుకున్నాడు. అటు తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉంటూ వచ్చాడు. కానీ 2023లో ఎవ్వరూ ఊహించని విధంగా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయిన షురా ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు.
Arbaaz Khan
అటు తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ జంట ఓ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంది. విషయం ఏంటంటే.. షురా త్వరలో తల్లి కాబోతుందట. సో ఖాన్ ఫ్యామిలీలోకి మరో మెంబర్ యాడ్ అవ్వనున్నాడు అని స్పష్టమవుతుంది. అయితే ఇప్పుడు అర్బాజ్ ఖాన్ వయసు 57 ఏళ్ళు. ఈ లేటు వయసులో అతని మళ్ళీ తండ్రి కాబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఇక అర్బాజ్ ఖాన్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘జై చిరంజీవ’ (Jai Chiranjeeva) లో విలన్ గా నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అటు తర్వాత రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ (Kittu Unnadu Jagratha) ‘శివమ్ భజే’ (Shivam Bhaje) వంటి సినిమాల్లో కూడా విలన్ రోల్స్ చేసి మెప్పించాడు. షురా ఖాన్ విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ రవీనా టాండన్, ఆమె కుమార్తె రాషా తడానీలకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.