వివేక్ ఒబేరాయ్ పరిచయం అవసరం లేని పేరు.రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్ర సినిమా ద్వారా ఈయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు ఈ సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించినటువంటి ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం తెలుగులో విలన్ పాత్రలలో నటించారు. ఈ క్రమంలోనే రాక్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగాను అలాగే విలన్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా తన బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో దారుణంగా మోసపోయారని తెలుస్తోంది.
ఈయనని ముగ్గురు వ్యక్తులు బాగా నమ్మించి దాదాపు కోటిన్నర వరకు నష్టాలను తీసుకువచ్చినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని తాజాగా ఈయన అంథేరిలోగల `ఎంఐడీసీ` పోలీసస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్లో ఈయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ ముగ్గురు వ్యక్తులు సినిమా ప్రొడక్షన్ ఈవెంట్లో వివేక్ ఒబెరాయ్ చేత కోటి 55లక్షలు ఇన్వెస్ట్ పెట్టించారు. ఇందులో డబ్బు పెడితే మంచి లాభాలు ఉంటాయని చెప్పడంతో వారి మాటలను నమ్మినటువంటి ఈయన (Actor)ఏకంగా కోటిన్నర రూపాయలను పెట్టుబడిగా పెట్టారు.
అయితే వాళ్లు ఈవెంట్లు, సినిమా నిర్మాణాలు చేయకుండా తమ స్వలాభాలకు వాడుకున్నారు. ఈ విధంగా ఎలాంటి సినిమా నిర్మాణాలు చేయకుండా ఆ డబ్బును మొత్తం ఆ ముగ్గురు తమ స్వలాభాల కోసం వాడుకోవడంతో వివేక్ ఒబెరాయ్ అకౌంటెంట్ సలహాల మేరకు ఈయన పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఐపీసీ సెక్షన్ 34, 409, 419, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.