Star Actor: షూటింగ్‌లో ప్రమాదానికి గురైన స్టార్ హీరో..ఆందోళనలో అభిమానులు!

చిత్ర పరిశ్రమలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇండస్ట్రీ వర్గాల వారు, సెలబ్రిటీల సన్నిహితులు, అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రముఖ తమిళ నటుడు బోస్‌ వెంకట్‌ సోదరి, సోదరుడు ఒకే రోజు చనిపోయిన సంఘటన చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది. శనివారం (జూన్ 24) న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అర్జున్‌ జంధ్యాల తండ్రి భాస్కర శాస్త్రి కన్నుమూశారు. ఈ వార్తలు మరువకముందే పాపులర్ సింగర్ మంగ్లీ ప్రమాదానికి గురయ్యారనే వార్త కలవరానికి గురి చేసింది.

తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణలో ఆమె పాల్గొన్న మంగ్లీ, షూటింగ్ సమయంలో కాలు జారి కింద పడడంతో కాలికి గాయమైంది. రీసెంట్‌గా మలయాళ స్టార్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారనే న్యూస్‌తో చిత్ర వర్గాల వారు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కేరళలోని మరయూర్‌ బస్టాండ్‌లో ఆయన నటిస్తున్న ‘విలాయత్ బుద్ధ’ షూట్ జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

KSRTC బస్సులో పృథ్వీరాజ్ సుకుమారన్, ఫైటర్స్ మీద ఫైట్ తీస్తుండగా ఆయన జారి కింద పడడంతో కాలికి గాయమైంది. దీంతో అప్రమత్తమైన మూవీ యూనిట్ కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. ఈరోజు (జూన్ 26) ఆయన కాలికి సర్జరీ చేయనున్నారు. దాదాపు 3 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు చెప్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రస్తుతం ‘సలార్’ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – ‘కె.జి.యఫ్’ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాజ మన్నార్ అనే విలన్ క్యారెక్టర్‌లో జగపతి బాబు నటిస్తుండగా..

ఆయన కొడుకు వరద రాజ మన్నార్ పాత్రలో (Star Actor) పృథ్వీ కనిపించనున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితమే. పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి కలిసి చేసిన ‘భీమ్లా నాయక్’ ఒరిజినల్ వెర్షన్‌లో నటించి ఆకట్టుకున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మాతృక ‘లూసిఫర్’ చిత్రానికి దర్శకత్వం వహించి ఆశ్చర్యపరిచారు. ఆయన మోహన్ లాల్‌తో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’ ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేయనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరగా కోలుకోవాలంటూ సినీ పరిశ్రమ వారితో పాటు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus