హాలీవుడ్ నటుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను కొందరు దుండగలు తుపాకితో కాల్చి చంపినట్లు తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు హాలీవుడ్ సినిమాలలో నటించిన థామస్ జెఫర్సన్ ఈనెల 3వ తేదీన అమెరికాలోని జార్జియా నగరంలో చంపబడ్డారు. అర్ద రాత్రి ఓ ఎమర్జెన్సీ కాల్ అందుకున్న పోలీసులు అక్కడను వెళ్లి చూడగా, థామస్ జెఫర్సన్ చలనం లేకుండా పడి ఉన్నారు. ఆయన వెనుక వైపు గాయాలు ఉన్నాయి. థామస్ ని పరిశీలించిన పోలీసులు ఆయన మరణించినట్లు నిర్ధారించారు.
థామస్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటు హత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో ఉన్న స్థానికులను పోలీసులు విచారించినట్లు తెలుస్తుంది. అర్థరాత్రి కావడంతో ఆ హత్య గురించి మాకు తెలియదని చెవుతున్నారట. గన్ కల్చర్ అధికంగా ఉండే అమెరికాలో డబ్బులు, వస్తువుల కోసం కూడా హత్యలు జరుగుతాయి. అలా ఎవరైనా ఆయను చంపారా లేక థామస్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతుంది.
థామస్ హత్యకు గురైన రాత్రి ఒక షాప్ యజమానితో గొడవపడ్డారట. థామస్ హత్య వెనుక ఆయన హస్తం ఉండే సూచనలు కలవు. థామస్ హత్యతో హాలీవుడ్ దిగ్బ్రాంతికి గురైంది.