Actor: తన వైల్డ్‌ పాత్ర గురించి స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

సినిమా విలన్లకు ఓ ఇబ్బంది ఉంటుంది. వాళ్లు సినిమాల్లో కనిపించినట్లే… బయట కూడా అలానే ఉంటారు అనుకోవడం. ఈ మాట బయట జనాలు అనుకోవడం అంటే ఓకే అనుకోవచ్చు. అలా కాకుండా ఇంట్లో వాళ్లే అలా అనుకుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది. సినిమాలో నటించిన పాత్ర, ఆ పాత్ర చిత్రణను నిజ జీవితానికి ఆపాదించి చూస్తే ఇబ్బంది అవుతుంది. కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌ కూడా ఇలాంటి ఇబ్బందే పడ్డారట.

మనోజ్‌ (Actor) నటించిన ఓ సినిమాను చూసి… సతీమణి కోప్పడ్డారట. డబ్బులు కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా చేయవద్దని గట్టిగానే చెప్పారట. ఆమె తిట్టడం వల్లే, సినిమాలను ఎంచుకోవడంలో తన పంథాను మార్చుకున్నానని మనోజ్‌ బాజ్‌పాయ్‌ చెప్పారు. ఆ సినిమా పేరు చెప్పాలనుకోవడం లేదు అంటూ ఓ సినిమా గురించి చెప్పారు మనోజ్‌. అదొక బ్యాడ్‌ మూవీ… అందులో నేను హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ ఉంటాను. ఆ రోల్‌లో మనోజ్‌ను చూసి థియేటర్‌లో ఉన్న కొంతమంది అమ్మాయిలు హేళనగా మాట్లాడారట.

వాళ్ల మాటలు మనోజ్‌ భార్య చెవిన పడ్డాయట. దాంతో ఆ సినిమా అయిపోయిన వెంటనే మనోజ్‌కు ఆమె ఫోన్‌ చేసి బాగా కోప్పడ్డారట. ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. థియేటర్‌లో వాళ్ల మాటలు విని నేను అవమానంగా అనిపిస్తోంది. ఇకపై ఇలాంటివి చేయొద్దు అని క్లారిటీ ఇచ్చిందట. ఆ తర్వాతే సినిమాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాను చెప్పారు. బాలీవుడ్‌లో చాలా సినిమాల్లో నటించిన మనోజ్‌… ఓటీటీలో ‘ఫ్యామిలీ మ్యాన్‌’తో అదరగొట్టాడు.

తెలుగులో అయితే ‘హ్యాపీ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో పోలీస్‌గా అదరగొట్టారు అని చెప్పాలి. ఆ తర్వాత ‘పులి’, ‘వేదం’ తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల మనోజ్‌ నటించిన ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ అనే సిరీస్‌ విడుదలైంది. ఇందులో మనోజ్‌ లాయర్‌ పాత్రలో నటించారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus