ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన కృష్ణంరాజు మరణవార్త గురించి సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్పందిస్తూ కృష్ణంరాజు మరణవార్త విని కలత చెందానని అన్నారు. కృష్ణంరాజు ఎప్పటిలానే ఆరోగ్యంతో తిరిగి వస్తారని అనుకున్నానని కైకాల సత్యనారాయణ తెలిపారు. ఈ విధంగా జరుగుతుందని మాత్రం అస్సలు ఊహించలేదని ఆయన కామెంట్లు చేశారు. కృష్ణంరాజు కంటే నేను పెద్ద అయినా మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ద్రోహి సినిమా రిలీజైన సమయంలో ఆ సినిమాలో కృష్ణంరాజుకు డబ్బింగ్ ఎవరు చెప్పి ఉంటారని నాకు సందేహం కలిగిందని నాకు సహజంగా సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ తప్ప వేరే వాళ్ల వాయిస్ నచ్చదని ఆయన అన్నారు. అయితే ద్రోహి సినిమాలో కృష్ణంరాజు తెలుగు పలుకుతున్న విధానం నన్ను కట్టిపడేసిందని ఆయన తెలిపారు. డైలాగ్స్ అయినా కవితలు అయినా కృష్ణంరాజు పాత్ర స్పష్టంగా పలుకుతోందని గమనించానని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత నేను అల్లు రామలింగయ్యతో ఏమయ్యా లింగయ్యా? ఆ కుర్రాడికి డబ్బింగ్ చెప్పింది ఎవరని అడగగా అల్లు రామలింగయ్య సొంత డబ్బింగ్ అని చెప్పడంతో ఆశ్చర్యపోవడం నా వంతైందని ఆయన తెలిపారు. ద్రోహి సినిమా చూడటం పూర్తైన తర్వాత నేను కృష్ణంరాజుతో ఏమయ్యా అద్భుతంగా డైలాగులు చెబుతున్నావని నువ్వు మరిన్ని చిత్రాలలో నటించాలని అన్నానని ఆయన చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో అంటే.. ఇప్పుడు నన్ను మీకు కూడా పాత్రలు లేకుండా చేయమంటారా? అని కృష్ణంరాజు నాతో సరదాగా అన్నారని కైకాల సత్యనారాయణ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మా మధ్య పరిచయం మొదలు కాగా మేమిద్దరం ఎన్నో సినిమాలలో కలిసి నటించామని సత్యానారాయణ వెల్లడించారు. కృష్ణంరాజు కన్నుమూయడం సినిమా ఇండస్ట్రీకే కాదని మా అందరికీ తీరని లోటు అని సత్యనారాయణ అన్నారు. కైకాల సత్యనారాయణ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!