ఆ నటుడికి బెయిల్ వచ్చింది.. కానీ ఇక అలాంటివి సాగవట!

కోలీవుడ్ బుల్లితెర ఆర్టిస్ట్ లు దివ్య, అర్నవ్‌ ల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆల్రెడీ పెళ్లి చేసుకుని కొన్ని కారణాల వలన విడాకులు తీసుకుని తన పాపతో ఒంటరిగా జీవిస్తున్న దివ్యని… లేని పోని ప్రేమ ఒలకబోసి పెళ్లి చేసుకున్నాడు అర్నవ్.అయితే దివ్య కడుపులో బిడ్డ పడిన తర్వాత ఆమెను వదిలించుకోవాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో వేరే అమ్మాయితో ప్రేమాయణం మొదలుపెట్టాడు. అంతేకాదు కడుపుతో ఉన్న దివ్యని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టాడు.

ఓసారి దివ్య సెట్స్ కు వెళ్లగా అక్కడ అర్నవ్ వేరే అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ ఈమె కంట పడ్డాడు.దీంతో అప్పటి నుండి ఆ అమ్మాయి కూడా దివ్యని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టింది. అర్నవ్ ను వదిలేస్తావా లేదా.. నీ కళ్ళ ముందే అతనితో పడుకుంటాను.. అంటూ ఘోరమైన పదజాలంతో దివ్యని చిత్ర హింసలు పెట్టడం మొదలు పెట్టింది. ఇక అర్నవ్ కూడా దివ్యని చంపేస్తాను.. అంటూ బెదిరించాడు.

ఈ క్రమంలో నిస్సహాయ స్థితిలో దివ్య పోరూరు మహిళా పోలీస్ స్టేషన్ లో అర్నవ్ పై కేసు పెట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు అర్నవ్ ను ఇటీవల అరెస్టు చేసిన పోలీసులు అతన్ని పుళల్ జైలుకు తరలించారు. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పూందమల్లి నేర విభాగం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

మెజిస్ట్రేట్ స్టాలిన్ దీనిపై శుక్రవారం విచారణ జరిపి అర్నవ్ కు కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేసింది.అర్నవ్ ఈ రెండు వారాలు పోరూరు మహిళా పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. అంతేకాదు దివ్యకు ఎటువంటి హాని తలపెట్టినా ఇతని బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే పోలీసులకు చెప్పకుండా ఇతను వేరే ప్రదేశాలకు వెళ్ళకూడదు. షూటింగ్ రీత్యా వెళ్లినా.. అందుకు అనుమతులు లభించాకే వెళ్లాల్సి ఉంటుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus