షాకింగ్..ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు..!

గత నాలుగు నెలల్లో 40 మంది వరకు సినీ ప్రముఖులు మరణించారు. కొంతమంది వయసు మీద పడిన వాళ్ళు. మరికొంతమంది అనారోగ్య సమస్యల బారిన పడ్డ వాళ్ళు. మరికొంతమంది హార్ట్ స్ట్రోక్ లతో, ఇంకొంతమంది యాక్సిడెంట్ ల బారిన పడి, ఇంకా కొంతమంది అయితే సూసైడ్ చేసుకుని చనిపోయారు.సినీ సెలబ్రిటీలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా మరణించడం అందరినీ కలచివేసే విషయం. ఇక ఈ మధ్యనే సూపర్ స్టార్ కృష్ణ, దర్శకుడు మదన్ వంటి వారు మరణించిన సంగతి తెలిసిందే.

ఇంకా చిన్నా చితకా సెలబ్రిటీలు సైతం మరణించారు. ఆ విషాదం నుండి ఇంకా కోలుకోకముందే చిన్న చిన్న ఆర్టిస్ట్ లు అలాగే పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా మరణించడాన్ని మనం చూశాం. ఇదిలా ఉండగా.. తాజాగా మరో నటుడు హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. ‘మిషన్ మంగళ్’ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు విక్రమ్ గోఖలే అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చేరారట. 15 రోజుల క్రితమే ఈయన హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తుంది.

కానీ ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుణేలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్లో ఈయన చికిత్స పొందుతున్నారట. ఈయన పరిస్థితి ఏమాత్రం బాలేదని వైద్యులు చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు.’హమ్ దిల్ దే చుకే సనమ్’ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తండ్రిగా ఈయన నటించి మెప్పించారు. ‘భూల్ భులయా’ ‘దిల్ సే’ ‘దే ధనాధన్’ ‘హిచ్కీ’ ‘నికమ్మా’ వంటి చిత్రాల్లో ఈయన నటించి మెప్పించారు. ఇప్పుడు ఈయన వయసు 77 ఏళ్ళు. !

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus