సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏడాది ఆరంభంలో ‘హిట్ 3’ అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ మరణించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకురాలు అపర్ణ మల్లాది కూడా గుండెపోటుతో మరణించారు. తర్వాత వృద్ధాప్యంలో ఉన్న సీనియర్ నటులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన వాళ్ళు కూడా మరణించారు. ఇక కొంతమంది యువ నటీనటులు కూడా రోడ్డు ప్రమాదాల్లో లేదు అంటే ఆత్మహత్య చేసుకుని మరణించడం వంటివి కూడా చూశాం.
ఈరోజు నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. ఆ షాక్ నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో నటుడి మరణవార్త వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నటుడు యోగేష్ మహాజన్ (Yogesh Mahajan) మృతి చెందారు. ఆదివారం నాడు ఆయనకు హార్ట్ ఎటాక్ రావడంతో.. మరణించినట్టు తెలుస్తుంది. శనివారం సీరియల్ షూటింగ్లో పాల్గొన్న ఆయన కొంచెం.. నీరసంగా ఉండటంతో హాస్టల్ రూమ్ కి వెళ్లి పడుకున్నాడట. ఆ మరుసటి రోజు ఆయన షూటింగ్ కి రాకపోవడంతో.. మేకర్స్ అతన్ని సంప్రదించగా ఎటువంటి సమాధానం రాలేదట.
దీంతో హోటల్ కి వెళ్లి చూస్తే.. యోగేష్ (Yogesh Mahajan) చచ్చి పడి ఉన్నట్టు వారు గుర్తించారు. ఈ ఘటన యావత్ మరాఠీ చిత్ర పరిశ్రమని కుదిపేసినట్టు అయ్యింది. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత మరాఠీ, హిందీ, భోజ్‌పురి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. దీనికి ముందు ఆయన ఇండియన్ ఆర్మీలో కూడా పనిచేశారు. ‘ముంబైచే షహానే’, ‘సంసార్చి మాయ’ వంటి మరాఠీ చిత్రాలు యోగేష్ ను బాగా పాపులర్ చేశాయి.