వరుస విషాదాలు సినీ పరిశ్రమను వెంటాడుతున్నాయి.. సినీ రంగంలోని వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు.. కొందరు వయసు రీత్యా వచ్చే సమస్యలతో మరణిస్తే.. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో కన్నుమూస్తున్నారు.. ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకుని అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.. ప్రముఖ మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు ఇన్నోసెంట్ అనారోగ్యంతో మరణించారు.. భోజ్ పురి నటి ఆకాంక్ష దూబే సూసైడ్ చేసుకుందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..
ఈమె వయసు 25 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం.. అయితే ఆకాంక్ష ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం పై క్లారిటీ లేదు.. ఇదిలా ఉంటే తాజాగా మరో యువనటి కూడా ఆత్మహత్య చేసుకుందనే వార్తతో ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ ఒడిశా నటి, సింగర్ రుచిస్మిత గురు సూసైడ్ చేసుకుంది.. తన గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుందామె.. కాగా ఆత్మహత్యకు ముందు తన కూతురు పరోటా విషయంలో గొడవ పడిందని ఆమె తల్లి చెప్పారు..
స్మిత ఆదివారం (మార్చి 26) రాత్రి 8 గంటల సమయంలో ఆలూ పరోటా చేయమని చెప్పిందని.. తాను 10 గంటలకు చేస్తానని చెప్పడంతో గొడవకి దిగిందని.. దీంతో తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. కాగా రుచిస్మిత (Ruchismita) పలు మ్యూజిక్ ఆల్బమ్స్, స్టేజ్ షోలు కూడా చేసింది..