అభిమానులకు షాక్ ఇచ్చిన హీరోయిన్.. తప్పేంటి అంటూ…!

డేటింగ్ అనే పదం ఇప్పుడు సినీ జనాలకే కాదు సాధారణ ప్రేక్షకులకు కూడా చాలా చిన్న పదం అయిపోయిందని చెప్పాలి. పెళ్లికి ముందే ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి కొంతకాలం జీవించి.. ఆ తర్వాత బాండింగ్ ఉంటే పెళ్లిచేసుకోవడం లేదంటే విడిపోయి ఎవరి దారి వారు చూసుకుంటూ ఉంటారు.నిజానికి ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. కానీ పలానా హీరోయిన్ లేదా హీరో పలనా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు మనం నిత్యం చదువుతూనే ఉంటాం.

సినీ సెలబ్రిటీలు ఈ విషయాలను ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కొన్నాళ్లుగా ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్న హీరోయిన్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందట. వివరాల్లోకి వెళితే.. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ మూవీతో ప్రేక్షకాదరణ పొందిన నటి ఫ్రీదా పింటో. ఈమె పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందట. ఈ విషయాన్ని స్వయంగా ఫ్రీదా పింటో తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అంతేకాదు తన ప్రియుడు కోరి ట్రాన్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

వీరిద్దరూ 2017 నుండీ డేటింగ్ లో ఉన్నారు.గతంలో వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామని కూడా ప్రకటించారు.కానీ కరోనా ఎంట్రీ వల్ల వీళ్ళ ఆలోచన మారింది. ‘పెళ్లయితేనే కలవాలా? ఆ ఆలోచన వస్తే మేము ఒకటైనట్టే’ అంటూ మోరల్స్ చెబుతుంది ఈ జంట. ఇక ఫ్రీదా గర్భవతి అని ప్రకటించడంతో ఆమె స్నేహితులు ,సన్నిహితులు ఈమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus