Actress: పవన్ వల్ల నాని హీరోయిన్ దశ తిరిగినట్టేనా?

దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `నానీస్ గ్యాంగ్ లీడ‌ర్` చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియాంక అరుళ్ మోహ‌న్. తొలి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసింది ఈ చెన్నై బ్యూటీ. విక్రమ్ కుమార్ సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారు…అలాగే వాళ్ళ నటనకి కూడా స్కోప్ ఉండేలా డిజైన్ చేస్తుంటాడు.అదే కోవలో ప్రియాంక కి కూడా మంచి పాత్రని ఇచ్చాడు. ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు కూడా ప్రియానే..!

‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తర్వాత  (Actress) ప్రియాంక అరుళ్ మోహన్ తెలుగులో బిజీ అయిపోతుంది అనుకుంటే … సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడం వల్ల ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ టైంలోనే శ‌ర్వానంద్ తో `శ్రీ‌కారం` సినిమా చేసే అవకాశం దక్కింది. ఆ సినిమా అయినా ఆడుతుంది అనుకుంటే.. అది వచ్చి వెళ్లిన సంగతి కూడా జనాలకు గుర్తులేదు. ఈమె పనైపోయింది అనుకున్న టైంలో శివ కార్తికేయన్ ఈమెకు లైఫ్ ఇచ్చాడు.

అతను హీరోగా నటించి నిర్మించిన ‘డాక్టర్’ మూవీలో ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు. అది సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘కాలేజ్ డాన్’ అనే సినిమాలో కూడా ఎంపిక చేసుకున్నాడు. ఆ సినిమా కూడా హిట్ అయ్యింది. దీంతో తెలుగులో ఈమెకు ఓ పెద్ద ఆఫర్ దక్కింది. అదే ‘ఓజి’ చిత్రంలో..! సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో మొదట హీరోయిన్ ఉండదు అన్నారు. కానీ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేసి హీరోయిన్ పాత్రను ఇరికించారు.

ఈ సినిమాలో నటించడానికి స్టార్ హీరోయిన్లు అయితే ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. ‘ఓజి’ లో ఆమె పాత్రకి ప్రాముఖ్యత ఉంటుందా? లేదా.. సినిమా హిట్ అవుతుందా? లేదా? అన్నది తెలీదు కానీ… పవన్ వంటి పెద్ద హీరో సినిమాలో నటించిన తర్వాత ఈమెకు తెలుగులో వరుస ఆఫర్లు రావడం అయితే ఖాయమని చెప్పాలి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus