సంచలనంగా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

  • November 9, 2021 / 03:10 PM IST

సినిమాల్లో మాత్రమే కాదు నిజజీవితంలో కూడా నటీనటులు సలహాలు ఇస్తూ ఉంటారు.సాధారణ జనాలు ఇస్తే అందరూ వాటిని పట్టించుకోరు.. ‘దెయ్యం వేదాలు వల్లిస్తున్నట్టు’ లెక్కేసుకుంటారు. కానీ సినిమా వాళ్ళు చెబితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందన్న మాట. ఇది పక్కన పెడితే… తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదుర్కొన్న సంఘటనలను ఆధారం చేసుకుని జనాలకి సలహాలు ఇస్తుంటారు సినిమా వాళ్ళు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా అందరికీ గుర్తుండే ఉంటుంది.

గతంలో చాలా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డుని కూడా దక్కించుకుంది.అలాగే నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టి అటు తర్వాత దర్శకురాలిగా కూడా తన ప్రతిభని చాటింది. ఎప్పటికప్పుడు ఈమె తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు ఏవో ఒక సలహాలు ఇస్తుంటుంది. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ.. ‘పెళ్ళైన మగాడిని ప్రేమిస్తే కళ్ళకి మస్కారా పెట్టుకోవద్దని’ చెప్పుకొచ్చింది. పెళ్ళైన మగాడిని ప్రేమిస్తే చివరికి కన్నీళ్ళే మిగుల్తాయనేది ఈమె ప్రధాన ఉద్దేశం.

గతంలో ఈమె కూడా పెళ్ళైన వ్యక్తిని ప్రేమించి ఓ బిడ్డకి తల్లయ్యింది. చివరికి అతను కాదనడంతో ఆ బిడ్డతోనే జీవనం కొనసాగిస్తూ వస్తోంది.ఈమె మాత్రమే కాదు.. ఈమెలానే చాలా మంది నటీమణులు మోసపోయారు. అయితే ఈమె తన అనుభవంతో సలహా ఇచ్చినట్టు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ గా కూడా మారింది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus