ప్రేమ, పెళ్లి పేరుతో మోసం. అయితే మోజు తీరిపోయాక అబ్బాయి.. అమ్మాయిని వదిలేయడం, లేదా అబ్బాయి దగ్గర డబ్బులు అయిపోగానే అమ్మాయి.. అబ్బాయిని వదిలేయడం. ఇది కొత్త విషయం ఏమీ కాదు. తరతరాలకు జరుగుతున్నదే. కాకపోతే ఈ లిస్ట్ లో పాపులర్ అయిన సెలబ్రటీలు ఉంటే .. తప్ప ఇలాంటి వార్తలు వైరల్ అవ్వవు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త కూడా అలాంటిదే. కాకపోతే సినీ పరిశ్రమకు చెందిన జంట ఇది అంతే..!
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో నివసించే ఉషా రవి శంకర్ పలు కన్నడ సినిమాల్లో.. సీరియల్స్‌లో నటించి పాపులర్ అయ్యారు. ఉషకు ప్రముఖ బుల్లితెర నటుడు శరవణన్ పరిచయం, ప్రేమ వంటివి ఏర్పాడ్డాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. కాదు కాదు శరవణన్ మాత్రమే అనుకున్నాడు. ఉష మాత్రం ఇతని వద్ద మ్యాగ్జిమమ్ దోచేయాలని అనుకుంది. శరవణన్ కి కూడా డౌట్ రాలేదు విచ్చలవిడిగా ఖర్చు చేసేసాడు.
నెలలు గడుస్తున్నా కానీ (Actress) ఆమె పెళ్లి ఊసెత్తడం లేదు. దీంతో శరవణన్ ఆరాతీస్తూ వచ్చాడు. ఆమె కూడా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ వచ్చేది. చివరికి శరవణన్ భాగోతం తెలిసింది. ఈ క్రమంలో అతను కోర్టులో కేసు వేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఉషను అరెస్ట్ చేయవలిసిందిగా శివమొగ్గ పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు ఉషని అరెస్ట్ చేశారు. ఈ టాపిక్ ఇప్పుడు వైరల్ గా మారింది.