ఒకప్పుడు సినిమాల్లో లవ్ మేకింగ్ సీన్స్ లేదా Sruగార సన్నివేశాలు ఉన్నాయంటే.. ఫిలిం మేకర్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవారు. ముందుగా సెన్సార్ నుండి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. ఆ సీన్స్ ను అడ్డం పెట్టుకుని క్యాష్ చేసుకోవాలనుకునే ఫిలిం మేకర్స్ ఉన్నారు. వీటిలో నటించడానికి హీరోయిన్లు కూడా వెనుకాడడం లేదు. అయితే ఓ సీనియర్ స్టార్ హీరోయిన్ మాత్రం ఇక నుండి అలాంటి సీన్స్ లో నటించను అంటుంది.
ఆమె మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor). ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక పై బెడ్ రూమ్ సీన్స్ లేదా లవ్ మేకింగ్ సీన్స్ లో అస్సలు నటించను. ఇలాంటి సన్నివేశాలు తెరపైకి తెచ్చే ముందు వాటి గురించి అవగాహన ఉండాలి. అవి సినిమాల్లో ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి వాటిపై గౌరవం ఏర్పడేలా తీర్చిదిద్దాలి. సినిమాల్లో కావాలని Sruగార సన్నివేశాలు పెట్టకూడదు.
ఇప్పుడు అన్ని సినిమాల్లో ఇవి కామన్ అయిపోయాయి. ప్రమోషన్స్ లో కూడా శృంగారాన్ని హైలెట్ చేసి జనాలని థియేటర్ కి రప్పించడం, కథని ముందుకు నడిపించడం వంటివి చేస్తున్నారు. కథ, కథనాలు సరిగ్గా లేకుండా Sruగార సన్నివేశాలు మాత్రమే ఉంటే సినిమాకి సరిపోదు. ఇది ఫిలిం మేకర్స్ కచ్చితంగా గమనించాలి. సినిమా కథ డిమాండ్ చేయకుండా Sruగార సన్నివేశాలు చిత్రీకరిస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఇండియాలో Sruగార సన్నివేశాల్లో నటించే హీరోయిన్లని మనవాళ్ళు ఏ దృష్టితో చూస్తారో కూడా అందరికీ తెలుసు. విదేశాల్లో అయితే ఇలాంటి సన్నివేశాలను చాలా నార్మల్ గా చూస్తారు. పెద్దగా వీటికి వంకలు పెట్టరు. అందుకే ఇక నుండి అలాంటి సన్నివేశాల్లో నటించకూడదు అని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చింది.