ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు.. చేతిలో ఉన్న షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని మరీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అవుతున్నారు.. వరుసగా ఇలాంటి వార్తలే వినాల్సి రావడంతో సదరు సెలబ్రిటీల అభిమానులు, పరిశ్రమ వర్గాల వారు ఆందోళనకు గురవుతున్నారు.. తాజాగా మరో పాపులర్ నటి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.. వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ సీరియల్ నటి శివాంగీ జోషీ గురించి సీరియల్స్ చూసే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు..
‘బాలికావధు 2’ తో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే.. ‘ఖేల్తీ హై జిందగీ ఆంఖ్ మిచోలి’ సీరియల్‌తో నటిగా మారిన శివాంగీ.. ‘హే రిస్తా క్యా ఖేల్తా హై’ ధారావాహికతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే ‘బైంతేహా’, ‘బెగుసరాయి’ లాంటి డైలీ సీరియళ్లలోనూ నటించి మెప్పించింది.. గతేడాది టెలికాస్ట్ అయిన ‘ఖత్రోం కీ ఖిలాడీ 12’ లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొంది.. తాజాగా ఈమెకు కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడంతో ఆస్పత్రిలో చేరింది. అందుకు సంబంధించిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది..
‘‘గతకొద్ది రోజులుగా నేను కఠిన పరిస్థితులను చూశాను.. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, డాక్టర్స్ సపోర్టుతో కోలుకున్నాను.. నా గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపింది.. అలాగే ప్రతి ఒక్కరూ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించింది.. త్వరలో ఏక్తా కపూర్ తెరకెక్కిస్తున్న ‘బ్యూటీ అండ్ బీస్ట్’ సీరియల్‌లో నటించడానికి రెడీ అవుతోంది శివాంగీ జోషీ..
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సీరియల్ ఇండస్ట్రీ వారు ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. పూర్తి ఆరోగ్యంతో ఇంతకుముందులా ఎనర్జీగా ఉంటూ.. షూటింగ్స్‌లో పాల్గొనాలని.. మమ్మల్ని మరింత ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నామంటూ శివాంగీ జోషీకి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.. ఆమె హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.. ఇన్‌స్టాలో 7.8 మిలియన్ల మంది ఆమెను ఫాలో చేస్తున్నారు..