2022 సంవత్సరం సినీ పరిశ్రమకు అస్సలు కలిసి రాలేదు.. వరుస ప్రమాదాలు, వివిధ భాషలకు చెందిన ప్రముఖుల మరణాలు సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నారు పరిశ్రమ వర్గాల వారు.. సరే కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి ప్రవేశించాం.. అంతా మంచే జరుగుతుందనుకుంటుండగా.. మరో ప్రముఖ నటి ఇకలేరనే వార్తతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి..వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ హాలీవుడ్ నటి జోన్ సిడ్నీ 86 ఏళ్ళ వయసులో క్యాన్సర్‌తో పోరాడుతూ మరణించారు..
‘ఎ కంట్రీ ప్రాక్టీస్’, ‘నెయిబర్స్’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారామె.. జోన్ సిడ్నీ స్నేహితురాలు సాలీ-అన్నే ఫేస్‌బుక్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.. తాజా సమాచారం ప్రకారం.. జోన్ సిడ్నీ డిసెంబర్ 29న సిడ్నీలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో రేడియో, టెలివిజన్, మినీ-సిరీస్, టెలీ మూవీలతో పాటు సినిమాలలో కూడా రాణించారు జోన్ సిడ్నీ.
లండన్‌లో జన్మించిన జోన్.. 1957లో రంగస్థల నటిగా ‘వెన్ వి ఆర్ మ్యారీడ్’ అనే ఇంగ్లీష్ నాటకం ద్వారా కెరీర్ ప్రారంభించారు.. అప్పుడు జోన్ వయసు సంవత్సరాలు.. ఆ తర్వాత 1965లో పెర్త్‌కి షిఫ్ట్ అయ్యారు.. ‘ది స్కాల్ప్ మర్చంట్’, ‘హెక్టర్స్ బనిప్’, ‘ఫ్లైట్ ఇన్ టు హెల్’ లాంటి టీవీ సిరీస్‌లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.. జోన్ ముఖ్యంగా 1983-1990 వరకు ప్రసారమైన టీవీ సిరీస్ ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు..
ఈ సిరీస్‌లో ఆమె దాదాపు 453 ఎపిసోడ్‌లలో జోన్ నటించడం విశేషం.. ఇక 1989లో ‘ఎ కంట్రీ ప్రాక్టీస్’ సిరీస్‌కి గాను బెస్ట్ పాపులర్ నటిగా సిల్వర్ లాగీ అవార్డును గెలుచుకున్నారు.. అంతేగాక జోన్.. ఆమెకు ఓ కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు.. 2015లో రొమ్ము క్యాన్సర్ బారినపడిన జోన్ సిడ్నీ.. అల్జీమర్స్ వ్యాధి సోకడంతో మరింత అనారోగ్యానికి గురయ్యారు.. అప్పటినుండి ఇటు వృద్ధాప్యంతో బాధపడుతూ కన్నుమూశారు..