స్టార్ హీరోయిన్ లైఫ్ లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత నటిగా మారి వరుస విజయాలు అందుకుంది. కొన్నాళ్లకు హాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. దీంతో గ్లోబల్ స్టార్ గా మారింది. 2018లో తనకంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ని వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ఇటీవలే ప్రియాంక సరోగసీ ద్వారా ఓ బిడ్డకు తల్లైన సంగతి తెలిసిందే.

Click Here To Watch NOW

ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రియాంక తన బయోగ్రఫీలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఓ పాపను దత్తత తీసుకోవాలన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. ప్రియాంక ఏమని రాసుకొచ్చిందంటే.. ‘ఒక రోజు ఇంట్లో చిన్న పాప ఏడుపు వినిపించింది. ఏంటా అని వెళ్లి చూస్తే అమ్మ(మధు చోప్రా) ఓ పాపను ఊయలలో వేసి ఆడిస్తుంది. ఎవరని అడగ్గా హాస్పిటల్‌ బయట కారు పార్కింగ్‌లో పాపను ఎవరో వదిలి వెళ్లారని, అక్కడ ఏడుస్తూ ఉండటంతో ఇంటికి తీసుకొచ్చానని చెప్పింది.

వర్షం కురుస్తున్న సమయంలో చిన్న పాపను అలా వదిలేసి వెళ్లడం నాకు చాలా బాధనిపించింది.దీంతో ఆ పాపను దత్తత తీసుకొని నా దగ్గరే ఉంచుకుంటానని చెప్పగా.. అమ్మ అభ్యంతరం చెప్పింది. సంతానం లేని దంపతులకు పాపను ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు అమ్మ తెలిపింది. ఆరోజు జన్మాష్టమి. వర్షం కురుస్తున్నప్పటికీ.. వెహికల్ నడుపుకుంటూ పాపను దత్తత తీసుకోవాలన్న ఫ్యామిలీ దగ్గరకు వెళ్లి వారికి పాపను అప్పగించింది. అడాప్షన్ కి అంత లీగల్ వర్క్ ఉంటుందని కూడా నాకు అప్పటికి తెలియదు. పాపను వారికి ఇవ్వగానే వాళ్ల సంతోషం, ఎమోషన్ ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ రాసుకొచ్చింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus