సినీ ప్రముఖులకు రెండో పెళ్లి, మూడో పెళ్లి వంటి వ్యవహారాలు కొత్తేమీ కాదు. కళ్ల ముందే చాలా మంది మూడు పెళ్లిళ్లు చేసుకుని 4 వ పెళ్ళికి కూడా రెడీ అవుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి.. మనం మేటర్ లోకి వెళ్ళిపోదాం. హాలీవుడ్ భామ జెన్నిఫర్ లోపెజ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. మన పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘జల్సా’ మూవీలో ఆమె పేరు పై పాటే ఉంది
అంటే ఆమె గ్లామర్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు తన అందంతో అప్పటి కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన భామల్లో ఈమె కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది. షాకిచ్చే అంశం ఏంటంటే ఈ అమ్మడి వయసు ఇప్పుడు 52 ఏళ్ళు, అయినా ఈ కూడా ఈ వయసులో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంది. అవును శనివారం నాడు ఆమె హాలీవుడ్ హీరో మరియు దర్శకుడు అయిన బెన్ అఫ్లెక్ ని పెళ్లాడింది.
ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఇది ఆమెకు 4 వ పెళ్లి.ఇంతకు ముందు ఆమెకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. అంతేకాకుండా ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న బెన్ .. ఈమె కంటే మూడేళ్లు చిన్నవాడు. అలాగే బెన్ అఫ్లెక్ కి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.ఇతని మొదటి భార్యకు మనస్పర్థలు రావడంతో విడాకులు ఇచ్చేసాడు. బెన్ మొదటి భార్యతో సంసారం చేసి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చాడు. ఇక జెన్నిఫర్ తన మూడో భర్తతో ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈమె 4వ పెళ్లి టాపిక్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.