”ఎన్నో చేదు అనుభవాలు.. ఇప్పటికీ భయపడుతుంటా”

గత కొద్దిరోజులుగా స్టూడెంట్స్ తమ స్కూల్స్ లో, కాలేజీల్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు, కుల వివక్ష గురించి బహిరంగంగా చెబుతున్నారు. ఇటీవల చెన్నైలో ఓ కళాశాలకు చెందిన కామర్స్ లెక్చరర్ పై అక్కడి స్టుడ్స్ కుల వివక్ష, లైంగిక వేధింపులు వంటి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి మిగిలిన స్కూల్స్, కాలేజీల విద్యార్థులు సైతం తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ’96’, ‘మాస్టర్’ వంటి సినిమాల్లో నటించిన గౌరీ కిషన్ కూడా స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంది.

ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లో కుల వివక్ష, లైంగిక వేధింపులు, బాడీ షేమింగ్ కు గురయ్యానంటూ తెలిపింది. ప్రతి ఒక్కరికీ చదువుకున్న రోజులు మధురజ్ఞాపకాలుగా ఉంటాయని.. కానీ అవే రోజులు కొందరికి భయం పుట్టించేవిగా ఉండడం నిజంగా బాధాకరమని చెప్పింది. తనకు కూడా అలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. ఇప్పుడు తన లాంటి అమ్మాయిలు వేల సంఖ్యలో ఉన్నారనే విషయం తీవ్రంగా కలిచివేస్తుందని చెప్పుకొచ్చింది. పాఠశాల అనేది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే మైదానం కావాలి కానీ వారి విలువలను కూల్చేసే స్థలం కాకూడదని రాసుకొచ్చింది.

తను చదువుకున్న అడయార్ హిందు సీనియర్ సెకండరీ స్కూల్ లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు.. అయితే దీనికి కారణమైన ఉపాధ్యాయుల పేర్లను చెప్పడం తనకు ఇష్టం లేదని చెప్పింది. ఇలాంటి విషయాలు బయటపెట్టడం వలన మున్ముందు పాఠశాలల సంస్కృతిపై మార్పు తీసుకురావొచ్చని చెప్పింది. బాల్యంలో ఇలాంటి సంఘటనలు నరకంగా ఉంటాయని.. అవి గుర్తుకు వస్తే గుండెల్లో వణుకుపుడుతుందని ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Share.