సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సమంత తండ్రి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నటి శోభిత (Shobitha) ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కి పడింది. కన్నడ నటి శోభిత నిన్న అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన శోభిత పలు సీరియల్స్,సినిమాల్లలో నటించారు. హైదరాబాద్ తుక్కుగూడ కి చెందిన సుధీర్ రెడ్డితో ఆమెకు ఏడాదిన్నర క్రితం పరిచయం ఏర్పడింది.
Shobitha
మాట్రిమోని సైట్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడటం, కొన్నాళ్ళకి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు కొండాపూర్, శ్రీరాంనగర్ కాలనీలో ఫ్యామిలీ పెట్టారు. శనివారం నైట్ కలిసి డిన్నర్ చేశారు శోభిత, సుధీర్..లు. తర్వాత సుధీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం వేరే రూమ్ కి వెళ్లగా, శోభిత వేరే గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళింది. కానీ తెల్లవారు జామున ఆమె రూమ్ క్లీనింగ్ కొరకు పనిమనిషి రాగా.. తలుపులు ఎంత కొట్టినా శోభిత తీయలేదట.
దీంతో విషయాన్ని సుధీర్ కి చెప్పగా, కంగారుతో వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూస్తే శోభిత ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఓ సూసైడ్ నోట్ ను గుర్తించినట్టు సమాచారం. అందులో ‘మీరు చావలి అనుకుంటే యు కెన్ డు ఇట్’ అంటూ రాసి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ సూసైడ్ నోట్ ప్రకారం ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయిందా? లేక భర్త టార్చర్ పెట్టడం వంటివి ఏమైనా కారణమా? అసలు సుధీర్ శోభిత(Shobitha) ..ల మధ్య ఏం జరిగింది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.