ప్రేమ, పెళ్లి , డేటింగ్, బ్రేకప్ వంటి వ్యవహారాలు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళకి బాగా కామన్. వాళ్లకు మాత్రమే కాదు ఆ విషయాల వినడం అలవాటు చేసుకున్న వాళ్ళకి కూడా బాగా కామన్ అనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది కొంచెం వేరు. ఓ నటి లేటు వయసులో విడాకులకు సిద్దమవ్వడం, అదీ రెండో భర్తకు విడాకులు ఇవ్వాలనుకోవడం అందరికీ షాకిచ్చే అంశం గా చెప్పుకోవాలి. ప్రముఖ టీవీ నటి దల్జీత్ కౌర్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కొంతకాలంగా ఆమె తన రెండో భర్త నిఖిల్ పటేల్ కి దూరంగా ఉంటుందని,ఆమెతో కూడా ఈమె విడిపోయింది అనే ప్రచారం ఊపందుకుంది.2023 మార్చిలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే ఏడాది కూడా గడవకముందే వీళ్ళు విడిపోయినట్టు టాక్ వినిపిస్తుంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. వీరి సన్నిహితులు కూడా ఈ విషయం పై పలుమార్లు అనుమానాస్పదంగా మాట్లాడటంతో ఈ ప్రచారం మొదలైంది. దల్జీత్ కౌర్ వయసు ఇప్పుడు 41 ఏళ్లు కావడం గమనార్హం.
దల్జీత్ కౌర్ కి (Dalljiet Kaur) 10 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు జైడెన్ అని తెలుస్తుంది. బిగ్ బాస్ 16లో కంటెస్టెంట్‌గా వెళ్లిన ఇతను ఫైనలిస్ట్‌గా ఎంపికయ్యాడు. దల్జీత్, ఆమె మొదటి భర్త షాలీన్ భానోట్ కి చెందిన కుమారుడు ఇతను. దల్జీత్‌ను వివాహం చేసుకునే ముందు నిఖిల్ పటేల్ కి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిఖిల్, దల్జీత్ మార్చి 2023లో వీరి పిల్లల సమక్షంలోనే ఏకంగా 7 సార్లు వివాహం చేసుకోవడం విశేషం.
ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!
‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!