‘8 వసంతాలు’ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫలితం అందరికీ తెలిసిందే. 2 రోజులకే బాక్సాఫీస్ వద్ద వాషౌట్ అయిపోయింది ఈ సినిమా. కానీ రిలీజ్ కి ముందు ఈ సినిమా హవా గట్టిగానే నడిచింది. టీజర్, ట్రైలర్స్ లో దర్శకుడి కవిత్వానికి ప్రశంసలు కురిశాయి. అలాగే ప్రమోషన్స్ లో దర్శకుడు ఫణీంద్ర నార్సెట్టి (Phanindra Narsetti) బోల్డ్ ఆటిట్యూడ్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చింది. తద్వారా సినిమాకి మైలేజ్ తీసుకొచ్చింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి.
కానీ సినిమాలో అతని కవిత్వాన్ని ఆడియన్స్ పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయారు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ పరంగా అందరూ అటెన్షన్ పే చేసి కూర్చున్నప్పటికీ.. సెకండాఫ్ లో ల్యాగ్ ఉండటంతో టార్గెటెడ్ ఆడియన్స్ కూడా డిస్ కనెక్ట్ అయిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా గురించి ఆడియన్స్ మర్చిపోతున్న టైంలో దర్శకుడు ఫణీంద్ర నార్సెట్టి (Phanindra Narsetti) ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
మొన్నామధ్య సక్సెస్ మీట్ లో ‘బ్రాహ్మణులని సినిమాలో తక్కువ చేసి చూపించారు’ అంటూ ఓ విలేఖరి మీడియా ముందు గొంతు పెద్దగా చేసుకుని వాధించిన విధానం పై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఈ కథని సూర్య – దీపికా పదుకోనె..లతో తీయాలని అనుకున్నట్టు తెలిపి షాకిచ్చాడు. అవును ‘8 వసంతాలు’ ని సూర్య (Suriya) – దీపికా (Deepika) ..లతో చేయాలని దర్శకుడు అనుకున్నాడట.
కానీ నిర్మాతలైన ‘మైత్రి’ వారు ‘వద్దు.. ఫ్లేవర్ మిస్ అవ్వకుండా కొత్త వాళ్ళతో చేద్దాం’ అనేసరికి వెనకడుగు వేశాడట దర్శకుడు ఫణీంద్ర. ఒకవేళ ఆ స్టార్స్ తో కనుక ఈ కథని చేసుంటే.. సినిమా స్థాయి వేరుగా ఉండేదేమో.