సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన రెండు నెలల్లో కృష్ణంరాజు, కృష్ణ,అలాగే ఆయన సతీమణి ఇందిరా దేవి గారు మరణించారు. దీంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. రెండు రోజుల క్రితం దర్శకుడు మదన్ కూడా కన్నుమూశారు. టాలీవుడ్లోనే కాకుండా పక్క ఇండస్ట్రీలో కూడా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్లో ఓ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటి తబస్సుమ్ గోవిల్ అనూహ్యంగా మరణించారు.
ఈ వార్త బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది. ఓ రకంగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఆమె శుక్రవారం రాత్రి మరణిస్తే.. తన తల్లి ఖననం అయ్యేవరకు ఎవరికీ చెప్పవొద్దని మాట తీసుకున్నట్లు హుషాంగ్ గోవిల్ తెలిపారు. తబస్సుమ్ గోవిల్ కి గుండెపోటు రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారట. వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆయన తెలిపారు.తబస్సుమ్ వయసు 78 సంవత్సరాలు.
తబస్సుమ్ గోవిల్ 1947 లో వచ్చిన ‘మేరా సుహాగ్’ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి సీనియర్ నటులకు ఈమె జోడీగా నటించింది. ముంబైలో ఈమె జన్మించారు. ప్రముఖ దూరదర్శన్ లో సెలబ్రెటీ టాక్ షో ‘ఫూల్ ఖిలే హై గుల్షన్ గుల్షన్’ అనే టాక్ షో లో ఎంతో మంది సెలబ్రెటీలను ఈమె ఇంటర్వ్యూ చేయడం జరిగింది.
అలాగే టీవీ షోలకు జడ్జీగా కూడా వ్యవహరించేది. రామాయణంలో రాముడిగా నటించిన అరుణ్ గోవిల్ సోదరుడు విజయ్ గోవిల్ ని ఈమె పెళ్లి చేసుకుంది. 1990లో వచ్చిన స్వర్గ్ తర్వాత ఈమె మరో చిత్రంలో నటించలేదు. అదే ఈమెకు ఆఖరి చిత్రం.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!