సీనియర్ స్టార్ హీరోల సినిమాలు అంటే హీరోయిన్ కోసం వెతుక్కోవడం పరిపాటి. ఎందుకంటే వారికి తగ్గ హీరోయిన్ల దొరక్క, దొరికినా వారు ఒప్పుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో సీనియర్ స్టార్ హీరోల పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే చిరంజీవి సమస్య మరోలా ఉంది. ‘లూసిఫర్’ రీమేక్‌లో హీరోయిన్ పాత్ర కోసం చర్చ ఓవైపు నడుస్తుంటే, హీరో సోదరి పాత్ర కోసం మరోవైపు వెతుకులాట నడుస్తోంది. ‘లూసిఫర్’ సినిమాను చిరంజీవి ఓకే చెప్పిన వెంటనే చాలామందికి వచ్చిన మొదటి డౌట్…
ఈ సినిమాలో మెయిన్ పాత్ర అయిన హీరో సోదరి పాత్ర ఎవరు చేస్తారు? అని. సినిమాలో అంతటి ప్రాముఖ్యం ఉంటుందా పాత్రకు. దీనికి సమాధానంగా నయనతార, అనుష్క స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే వాళ్లను హీరోయిన్లుగా తీసుకోవడానికి మాట్లాడుతున్నారు అని తర్వాత తెలిసిందే. అదేంటి ఆ సినిమాలో హీరోకు పెయిర్ ఉండదు కదా అంటారా… ఇక్కడ యాడ్ చేస్తున్నారు లెండి. అయితే తాజాగా చిరు సోదరి పాత్రకు మరో పేరు వినిపిస్తోంది. ఆమెనే విద్యా బాలన్.
బాలీవుడ్‌లో హీరోయిన్‌గా చేస్తూనే తెలుగులో మంచి పాత్ర వస్తే ఓకే చెప్పింది విద్యా బాలన్. ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’లో బసవతారకం పాత్ర పోషించింది విద్య. దీంతో చిరు టీమ్ విద్యా బాలన్‌ను సంప్రదించిందట. మరి ఆమె నుండి ఎలాంటి స్పందన వచ్చిందనేది తెలియాల్సి ఉంది. కరోనా పరిస్థితులు కుదుటపడటంతో త్వరలో సినిమాను ప్రారంభించాలని చిరంజీవి బృందం చూస్తోంది. దీంతో ఈ పాత్ర విషయంలో క్లారిటీ వచ్చేయొచ్చు.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!