సమస్యలు అనేవి సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రిటీలకు కూడా ఉంటాయి. అవి ఆర్థిక విషయాల్లో అయినా సరే, మానసికంగా అయినా సరే లేదా అనారోగ్య సమస్యలు అయినా సరే. సామాన్యుల్లానే సెలబ్రిటీలు కూడా ఆ విధంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు. కొన్ని చేయకూడని పనులు వాళ్ళు చేశారు అంటే వినడానికి, నమ్మడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా అలాంటి చెప్పుకోకుడని పని చేసి షాక్ ఇచ్చింది.
దీంతో వార్తలకెక్కింది. ఆమె చేసిన పనేంటో ఆల్రెడీ హెడ్డింగ్ చూసి ఓ ఐడియాకి వచ్చేసి ఉంటారు కదా. కాకపోతే ఆ హీరోయిన్ ఎవరు? అలాంటి పని ఎందుకు చేసింది. ఎలా చేసింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి. వివరాల్లోకి వెళితే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అమెరికా నటి అదే హాలీవుడ్ నటి అమాండా బైన్స్.. ఇప్పుడు ట్రెండింగ్లో నిలిచింది.
హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన ఈ బ్యూటీ లాస్ ఏంజల్స్ లో రోడ్ల పై నగ్నంగా తిరుగుతూ అందరికీ షాకిచ్చింది. దీంతో ఆమెను గుర్తుపట్టిన కొంతమంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చి ఆమెను సైకియాట్రిస్ట్ కు అప్పగించారు. అమాండా బైన్స్ మానసికంగా చాలా ఇబ్బందులు పడుతుందట.
ఆమెకు మతిస్థిమితం లేదు అని పోలీసులు తెలుసుకున్నారు. కొన్నాళ్ల క్రితం ఈమె కుక్కల్ని చంపడానికి ప్రయత్నించడం, పక్కనున్న ఇళ్లకు నిప్పు పెట్టడం వంటివి చేసిందట. ఈమె వయసు 36 ఏళ్ళు మాత్రమే కావడం విషాదకరం.