Samantha: సమంతకు ఆ విషయం తెలీదంటున్న కొరియోగ్రాఫర్!

స్టార్ హీరోయిన్ సమంత గతేడాది పుష్ప సినిమాలో ఊ అంటావా స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మొదట సమంత ఈ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. మరి కొందరు ఊ అంటావా సాంగ్ సమంత కెరీర్ కు మైనస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన గణేష్ ఆచార్య ఈ సాంగ్ కు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ భాష ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో ఈ సాంగ్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గణేష్ ఆచార్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ సినిమాలకు తెలుగులో ఎక్కువగా పని చేశానని గణేష్ ఆచార్య అన్నారు. సరైనోడు, డీజే సినిమాలతో పాటు పుష్ప సినిమాలో దాక్కో దాక్కో మేక పాటకు తాను కొరియోగ్రాఫర్ గా వ్యవహరించానని ఆయన తెలిపారు.

డిసెంబర్ నెల 2వ తేదీన బన్నీ ఫోన్ చేసి సాంగ్ చేయాలని కోరారని అదే సమయంలో తాను కంటికి సంబంధించిన సర్జరీ చేయించుకోవాల్సి ఉండటంతో తాను ఊ అంటావా సాంగ్ చేయలేనని చెప్పానని గణేష్ ఆచార్య అన్నారు. ఆ తర్వాత పుష్ప ప్రొడ్యూసర్స్ సర్జరీ డేట్ విషయంలో మార్పు చేసి ఊ అంటావా సాంగ్ కోసం పిలిపించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సాంగ్ సమయంలో సమంత నర్వస్ గా ఉందని గణేష్ ఆచార్య చెప్పుకొచ్చారు. ఊ అంటావా సాంగ్ కు తాను కొరియోగ్రాఫర్ అని సమంతకు మొదట తెలియదని ఆయన వెల్లడించారు.

సమంతకు తాను తొలిసారి ఊ అంటావా సాంగ్ కు కొరియోగ్రఫీ చేశానని ఆయన తెలిపారు. సమంతతో ఆటిట్యూడ్ కనిపించే విధంగా డిఫరెంట్ స్టెప్స్ తాను వేయించానని ఆమెతో వల్గర్ స్టెప్స్ వేయించాలని తాను భావించలేదని గణేష్ ఆచార్య అన్నారు. ఈ సాంగ్ వల్ల గణేష్ ఆచార్యకు కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయనే సంగతి తెలిసిందే. తెలుగులో గణేష్ ఆచార్యకు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus