సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది.కమెడియన్ అల్లు రమేశ్ మరణించిన తర్వాత 4 రోజులు కూడా పూర్తవ్వకుండా నిండా పాతికేళ్ళు కూడా లేని కొరియన్ పాప్ సింగర్, అలాగే నటుడు అయిన మూన్ బిన్ మరణించాడు. తర్వాత బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు అయిన యష్ చోప్రా భార్య అలాగే సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా కూడా కన్నుమూసింది. అలాగే టాలీవుడ్ నిర్మాత చెర్రీ (చిరంజీవి) తల్లి కూడా అనారోగ్య సమస్యలతో మరణించారు తర్వాత రోజు స్టార్ హీరో మమ్ముట్టి తల్లి కూడా వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.
ఈ విషాదాలతో సినీ పరిశ్రమ అల్లాడిపోయింది. తాజాగా మరో (Star Comedian) సీనియర్ కమెడియన్ మరణించడం అందరినీ షాక్ కు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. సీనియర్ కమెడియన్ మాముకోయ మరణించారు. ఈయన వయసు 76 సంవత్సరాలు కావడం గమనార్హం. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది. మాముకోయ ఓ మలయాళ నటుడు.
అలాగే కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన వందలాది సినిమాల్లో నటించి మెప్పించాడు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ ‘జనతా హోటల్’ అలాగే మోహన్ లాల్ ల ‘కనుపాప’ చిత్రంలో కూడా ఈయన నటించాడు. ఈయన మరణవార్తతో మలయాళ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన ఆత్మకు శాంతి చేకూరాలని మలయాళ సినీ సెలబ్రిటీలు కోరుకుంటున్నట్టు చెప్పుకొస్తున్నారు.అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలుపుతున్నారు.
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?