సినీ పరిశ్రమలో ఎక్కువగా బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. దర్శకనిర్మాతలు, నటీనటులు, టెక్నీషియన్లు, యూనిట్ మెంబర్స్ ఇలా ఎవరొకరు మరణించారు అనే వార్తలు ఎక్కువవుతున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ, వంటి సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటి బ్యాడ్ న్యూస్..లు వింటూ ఉన్నాం. ఇటీవల మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, ‘సింటోనియా’ నటి బ్రెజిలియన్ చైల్డ్ ఆర్టిస్ట్, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్ వంటి వారు మరణించారు.
ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకముందే… ఇప్పుడు మరో విషాదం చోటు చేసుకుంది. శాండల్ వుడ్ లో ఈ విషాదం చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. వివరాల్లోకి వెళితే.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్ రాకేష్ పూజారి (Rakesh Poojary) మృతి చెందారు. ఆయన వయసు కేవలం 33 సంవత్సరాలు మాత్రమే. తాజాగా ఆయన స్నేహితుల ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరవ్వగా.. సడన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది.
దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే అతని బంధుమిత్రులు హాస్పిటల్ కు తరలించారు. అయినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మరణించడం జరిగింది. దీంతో కన్నడ చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడి వారు సంతాపం తెలుపుతున్నారు. పలు రియాలిటీ షోలతో పాటు కన్నడ సినిమాల్లో, బుల్లితెర కార్యక్రమాల్లో ఆయన (Rakesh Poojary) పాల్గొన్నారు.