మరో స్టార్ హీరోయిన్ తెలుగింటి కోడలు కాబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కాగా, ఆ హీరో సుమంత్ (Sumanth) అని మీకు ఇప్పటికే ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇద్దరూ కాస్త క్లోజ్‌గా ఉన్న ఫొటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. అది ఎప్పుడు తీశారు, ఎవరు తీశారు, నిజమేనా లాంటి కామన్ ప్రశ్నలు వదిలేసి ‘ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు!’
అనే పాయింట్‌ను బయటకు లాగారు. అయితే దీనిపై సుమంత్ క్లారిటీ ఇచ్చేశారు. అక్కినేని కాంపౌండ్‌లో మరో పెళ్లి బాజా మోగబోతోంది అంటూ సుమంత్ – మృణాల్ గురించి వార్తలు వచ్చాయి. ఆమెతో సుమంత్ డేటింగ్‌లో ఉన్నాడు అనేది ఆ పుకార్ల సారాంశం. రేపో మాపో పెళ్లి అనేలా పుకార్లు వినిపించాయి కూడా. ఇదే మాట సుమంత్ దగ్గర ప్రస్తావిస్తే.. నాకు పెళ్లి మీద ఆసక్తి లేదు. సింగిల్‌గా ఉండటమే బాగుంది. నా జీవితంలో నేనెప్పుడు ఒంటరితనం ఫీలవ్వలేదు.
నాకు బోర్ అనే పదానికి అర్థం తెలియదు. నాకు ఒక తోడు కావాలని అనిపించలేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ పెళ్లి గురించే కాదు, తన జీవితంలో పెళ్లి అనే పదం గురించి కూడా క్లారిటీ ఇచ్చినట్లు అయింది. సుమంత్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోడని ఫిక్స్ అయిపోవచ్చు అని అనిపిస్తోంది. సినిమా పనులు, జిమ్‌తో రోజంతా బిజీగా ఉంటానని, వాటితోనే రోజంతా గడిచిపోతుంది అని చెప్పాడు.
అంతేకాదు రోజూ కనీసం ఐదు గంటలు సినిమా లేదా ఓటీటీ చూస్తానని తన డైలీ రొటీన్ గురించి చెప్పుకొచ్చాడు సుమంత్. అలాగే వారానికి రెండుమూడు సినిమాలైనా చూస్తాడట. ఒక్కడే థియేటర్లకు వెళ్లి మరీ సినిమాలు చూస్తాడట. ఇక ఆ ఫొటో గురించి చూస్తే.. ‘సీతారామం’ సినిమా షూటింగ్ సమయంలోనో లేక ప్రచారం సమయంలోనే క్లిక్ మనిపించింది అని తెలుస్తోంది. ఆ విషయంలో క్లారిటీ వచ్చేసి ఉంటే బాగుండేది.