స్టార్ హీరో, హీరోయిన్..ల బోల్డ్ డెసిషన్… 2 ఏళ్ళ పాపకి అన్ని కోట్లా?
- June 12, 2025 / 02:07 PM ISTByPhani Kumar
ఈ రోజుల్లో ఎవరు ఎంత కష్టపడినా.. అది వారి పిల్లల భవిష్యత్తు కోసమే. ఎంత సంపాదించినా.. అది కూడా వాళ్ళ పిల్లలకే చేరాలని ఆయాసపడుతూ ఉంటారు. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక.. అన్ని బాధ్యతలు తెలుసుకున్నాక.. ఆస్తుల పంపకాల ప్రోగ్రాం పెట్టుకుంటారు ఇండియన్ పేరెంట్స్. పొరపాటున ఏవైనా ప్రతికూల పరిస్థితులు వస్తాయని తెలిస్తే.. అప్పుడు రహస్యంగా ఓ వీలునామా రాయించడం వంటివి చేస్తారు.
Ranbir Kapoor, Alia Bhatt
సినిమాటిక్ గా అనిపించినా అదే నిజం. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్.. తమ 2 ఏళ్ళ పాపకు ఏకంగా రూ.250 కోట్ల ఆస్తి రాసేసి హాట్ టాపిక్ అయ్యారు. ఇది ఒకరకంగా అందరికీ షాకిచ్చే అంశమే. ఆ స్టార్ హీరో, హీరోయిన్ మరెవరో కాదు అలియా భట్ (Alia Bhatt), రణబీర్ కపూర్ (Ranbir Kapoor).

అవును రణబీర్ కపూర్ (Ranbir Kapoor) – అలియా భట్ (Alia Bhatt) లకు రాహా కపూర్ అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. 2022 నవంబర్లో జన్మించిన ఈ పాపకి ఇప్పుడు 2 ఏళ్ళు. అయితే రణబీర్- అలియా..లకి ముంబైలో ఉన్న బాంద్రాలో ఓ ఖరీదైన ఇల్లు ఉంది. అది 6 అంతస్తుల బిల్డింగ్. మంచి ఏరియాలో ఉంది. దాని విలువ రూ.250 కోట్లు. తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న ఆ ఇంటిని తమ కూతురి పేరుపై రిజిస్టర్ చేయించింది ఈ జంట.

ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలి అనే చట్టాలు ఉన్నా.. దాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ అలియా (Alia)- రణబీర్ (Ranbir) … తమ పాపను 2 ఏళ్లకే రూ.250 కోట్లకి వారసురాలిని చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు అని చెప్పాలి.















