జీవితంలో కొన్నిపోరపాట్లు జరగడం సర్వసాధారణమై..అయితే కొన్ని తప్పులు మన మధ్యే పరిష్కారం అవుతుంటాయి.. కొన్ని చట్టరీత్యా పరిష్కారం అవుతుంటాయి..ప్రముఖ దర్శకుడు లింగస్వామి కూడా చెక్ బౌన్స్ కేసులో కొర్టు మెట్లు ఎక్కారు. ఆ కేసులో దర్శకుడు ఎన్.లింగుస్వామి కి మద్రాస్ హైకోర్టు లో ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు చెక్ బౌన్స్ కేసు లో ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.లింగుస్వామి కి మద్రాస్ హైకోర్టు లో ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది.
ఎన్.లింగుస్వామి ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి ఒక చిత్ర నిర్మాణం కోసం తమ సొంత నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్ పేరుతో 2014లో పీవీపీ కేపిటల్స్ అనే ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఫైనాన్స్ కంపెనీకి రూ.1.35 కోట్లకు చెక్ ఇవ్వగా, బ్యాంకులో తగినంత నిల్వ లేని కారణంగా చెక్ బౌన్స్ అయింది. దీంతో ఫైనాన్స్ కంపెనీ చెన్నై సైదాపేట కోర్టును ఆశ్రయించగా, వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఈ శిక్షను చెన్నై జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కూడా ఖరారు చేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వి.శివజ్ఞానం సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. అపుడు లింగుస్వామి తరపున హాజరైన న్యాయవాది ఇప్పటికే 20 శాతం సొమ్మును చెల్లించామని, మరో 20 శాతం సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో 20 శాతం సొమ్మును ఆరు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కింది కోర్టులు ఖరారు చేసిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఆదేశించారు.
(Star Director) లింగుస్వామి విషయానికి వస్తే.. రీసెంట్‌గా ఆయన తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేదు. రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామి తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఆయన ఓ స్టార్ హీరో ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా అయితే కోలీవుడ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.