తెలుగులో తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించినా మంచి దర్శకుడిగా గీతాకృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ విషయం గురించైనా గీతాకృష్ణ తన మనస్సులో ఏది అనుకుంటే అదే మాట్లాడతారని ఇండస్ట్రీలో పేరుంది. గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్య దేశం అని మ్యూజిక్ విషయంలో ఇళయరాజా మంచోడు అని అన్నారు. హ్యాట్, స్పెక్ట్స్ లేకుండా నన్ను నేను చూపించనని గీతాకృష్ణ తెలిపారు. ఇవి లేకపోయినా చూడటానికి నేను బాగానే ఉంటానని ఆయన అన్నారు.
స్టైలిష్ గా ఉండటం కోసం హ్యాట్ పెడుతున్నానని ఆయన వెల్లడించారు. నేను ఇతరులపై డిపెండ్ కానని అయన అన్నారు. నేను వందల సంఖ్యలో యాడ్స్ చేశానని సమంత, తమన్నాలను కూడా యాడ్స్ ద్వారా పరిచయం చేశానని ఆయన తెలిపారు. వాళ్లు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందే నేను పరిచయం చేశానని ఆయన చెప్పుకొచ్చారు. యాడ్స్ గురించి ఎవరూ పెద్దగా చెప్పుకోరని ఆయన అభిప్రాయపడ్డారు. నేను దర్శకత్వం వహించిన సినిమాలు అడ్వాన్స్ సినిమాలు అని ఇప్పుడు తీయాల్సిన సినిమాలను నేను అప్పుడే తీశానని ఆయన కామెంట్లు చేశారు.
కొన్ని సినిమాలు మంచి సినిమాలు అనిపించుకున్నా సక్సెస్ కాలేదని గీతాకృష్ణ తెలిపారు. కొరియన్ సినిమాల నుంచి నేను ఇన్స్పైర్ అయ్యానని ఆయన తెలిపారు. నేను తీసిన సినిమా 20 ఏళ్ల తర్వాత హాలీవుడ్ లో వచ్చిందని వాళ్లు నన్ను కాపీ కొట్టారా? అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఫిల్మ్ ఫెస్టివల్స్ కు ఎక్కువగా వెళతానని ఆయన తెలిపారు.
కెరీర్ విషయంలో నేను గ్యాప్ తీసుకున్నానని సక్సెస్ లో ఉన్న సమయంలో తన దగ్గరకు నిర్మాతలు వచ్చారని గీతాకృష్ణ కామెంట్లు చేశారు. ప్రభుదేవాకు నాకు మధ్య గొడవైందని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు. చెవిలో పువ్వు, తొట్టిగ్యాంగ్ టైటిల్స్ నావి అని ఇ.వి.వి.సత్యనారాయణ కాపీ కొట్టారని గీతాకృష్ణ పేర్కొన్నారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!