తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా రాణిస్తున్న నటుడ్ని కనిపెట్టండి చూద్దాం..!

ఒకప్పుడు ఇష్టమైన హీరోలు లేదా ఇష్టమైన హీరోయిన్ల పర్సనల్ ఫోటోల కోసం మ్యాగ్జైన్ లు వంటివి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగింది. సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వాళ్ళ పర్సనల్ ఫోటోలను షేర్ చేయడానికి కూడా వారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఇదివరకటిలా అభిమానులు రేర్ పిక్స్ కోసం పాకులాడటం లేదు. అయితే కొన్ని రేర్ పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

ఆ టైంలో ఆ ఫోటోల పై చర్చ జరుగుతుంటుంది. తాజాగా ఓ ఫోటో గురించి తెగ చర్చ జరుగుతుంది. ఈ ఫొటోలో ఉన్న స్టార్ నటుడు ఎవరంటూ పజిల్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు విజయ్ సేతుపతి.కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి, రెండు, నిడివి కలిగిన పాత్రల్ని చేస్తూ వచ్చిన విజయ్ సేతుపతి తర్వాత హీరోగా, సహాయ నటుడిగా, విలన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నాడు.

విజయ్ సేతుపతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ నటులలో ఒకడు. హీరో అంటే అందంగా ఉండాలి, సిక్స్ ప్యాక్ ఉండాలి, 6 అడుగులు ఉండాలి.. అనుకోవడం తప్పు అని విజయ్ సేతుపతి నమ్ముతుంటాడు. అలాగే స్టార్ నటుడు అంటే హీరోగానే చేయాలి అనే అపోహలను కూడా ఇతను కొట్టిపారేశాడు.

‘మాస్టర్’ చిత్రాన్ని కనుక చూసుకుంటే… ఆ చిత్రం కథ అంతా ఇతని పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాల్లో అయితే హీరోని కూడా డామినేట్ చేసే విధంగా ఉంటుంది ఆ పాత్ర. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి విజయ్ సేతుపతి చిన్నప్పటి ఫోటోని మీరు కూడా ఓ లుక్కేయండి :

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus