Sania Mirza: సానియాకి నేను ఆ పని చేస్తూ తన తల్లికి దొరికేసాను!

ఇండియన్ స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా..అందరికీ సుపరిచితమే. ఇండియన్ అయినప్పటికీ 2010 లో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. వీరి వివాహం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. భారత దేశానికి చెందిన అమ్మాయి.. ఓ పాకిస్థానీ పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసి సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దిష్టిబొమ్మలు తగలబెట్టారు.

సోషల్ మీడియాలో అంతంత మాత్రం ఉన్న రోజుల్లో కూడా వీరి పెళ్లి వ్యవహారం పెద్ద సంచలనం సృష్టించింది. అయితే వీళ్ళ పెళ్లి మాత్రం సీక్రెట్ గా జరిగిపోయింది. ఆ తర్వాత కూడా సానియా పై ఆ విమర్శలు కంటిన్యూ అయినప్పటికీ.. షోయబ్ మాలిక్ సొంత దేశం పాకిస్థాన్ కాదు, దుబాయ్ అంటూ మన వాళ్ళు సరిపెట్టుకున్నారు. ఆ తర్వాత మాలిక్- సానియా లది సూపర్ పెయిర్ అంటూ ప్రశంసలు కూడా కురిపించారు.

అయితే సానియా మీర్జా తన ఆటతోనే కాదు అందంతో కూడా అప్పటి కుర్రకారుని కట్టిపడేసేది. ఇదిలా ఉండగా.. సానియా మీర్జా అంటే ఓ స్టార్ హీరోకి చాలా ఇష్టమట. ఆమె తన క్రష్ అని ఓపెన్ గానే చెప్పేశాడు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు వరుణ్ ధావన్. ఇతను ప్రొడక్షన్ కంపెనీలో వర్క్ చేసే రోజుల్లో సానియా యాక్ట్ చేసిన ఓ యాడ్ కు పనిచేశాడట. అప్పుడు ఓ సందర్భంలో తనకు యాపిల్ తినాలనిపించి.. వరుణ్ ను తీసుకురమ్మని చెప్పిందట.

అతను తెచ్చి ఇస్తున్న టైంలో సానియా తల్లి చూసి నువ్వెందుకు తెచ్చావ్? అని అడిగిందట. అప్పుడు సానియా ‘నేనే తెమ్మని చెప్పాను’ అని చెప్పిందట. నిజానికి వరుణ్.. అలా సానియాకి తెచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ క్రష్ ఫీలింగ్ అని చెప్పాడు కదా.. అందుకు తెచ్చిచ్చాడట. ఇక వరుణ్ నటించిన ‘తోడేలు’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus