తనకు సోకిన వ్యాధికిగల లక్షణాలను బయట పెట్టిన స్టార్ హీరో ఎవరంటే.?

సినిమా ఇండస్ట్రీకి ఏమైందో కానీ టాలీవుడ్, బాలీవుడ్ నుండి ఇతర ఇండస్ట్రీలో గురించి కూడా కొద్దిరోజులుగా షాకింగ్ విషయాలే వినాల్సి వస్తోంది.. స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తనకు సోకిన అరుదైన వ్యాధి గురించి బయట పెట్టిన సంగతి తెలిసిందే.. దీంతో ఫ్యాన్స్, పరిశ్రమ వర్గాలవారు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇటీవల డిసార్డర్స్‌తో బాధపడుతున్న హీరోయిన్ల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి..ఇప్పుడు బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో తను కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి షాక్ ఇచ్చాడు..

ఆ హీరో ఎవరో కాదు.. వరుణ్ ధావన్.. తండ్రి డేవిడ్ ధావన్ హిందీలో స్టార్ అండ్ సీనియర్ డైరెక్టర్.. ఎన్నో సూపర్ హిట్స్ తీశారు. వరుణ్, కెరీర్ స్టార్టింగ్‌లో కరణ్ జోహార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి.. 2012 లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. నటన, డ్యాన్సులు, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.. తర్వాత పలు సినిమాల్లో నటించి ఓన్ ఐడెంటిటీ తెచ్చుకున్నాడు.. వరుణ్ నటించిన ‘బేడియా’ మూవీ నవంబర్ 25న రిలీజ్ కానుంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి మంచి రెెస్పాన్స్ వచ్చింది.. ఇందులో తోడేలు కరిచిన మనిషి ఎలా మారతాడు అనే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు.. ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనే అరుధైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నానని చెప్పి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాడు.. అందుకే కొద్దికాలంగా షూటింగ్స్‌ ఏవీ చేయకుండా ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నానని అన్నాడు.. ఈ వ్యాధి గురించి వరుణ్ ధావన్.. ‘‘ఇది చాలా రేర్ డిసార్డర్.. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ లాంటి లక్షణాలు ఉన్నవారు బాడీలోని బ్యాలెన్సింగ్‌ని అప్పుడప్పుడు కోల్పోతుంటారు.

వికారం, వాంతులు వచ్చినట్లు అనిపించడం.. ఒక్క చోటు సరిగా కూర్చోలేకపోవడం.. కొన్నిసార్లు శరీరంపై పూర్తిగా నియంత్రణ అనేది లేకుండా పోతుందని వైద్య నిపుణులు తెలిపారు’’ అని చెప్పుకొచ్చారు. వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అనేది చెవికి సంబంధించిన వ్యాధిగా చెప్పొచ్చు. ఇది జన్యుపరమైన లేదా ట్రామటిక్ కారణాలతో సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు. ఇలాంటి ఇబ్బంది కొంతమందికి ఒకవైపు మాత్రమే వస్తే.. కొంతమందికి రెండు వైపులా వస్తుందట. వరుణ్ ధావన్ ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ ఇండస్ట్రీ వారు, ఫ్యాన్స్, ఫ్రెండ్స్ కోరుకుంటున్నారు..

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus