Samantha: నాలాగా చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదు… దిమ్మతిరిగే సమాధానం చెప్పిన సమంత!

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. సినిమాలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా సమంత కనిపించడం లేదు. మయోసైటీసిస్ వ్యాధి బారిన పడిన సమంత చికిత్స తీసుకుంటూ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే సమంత నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 27వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సమంత మల్లి మీడియా ముందుకి వచ్చింది.

సినిమాల పట్ల ఎంతో అంకితభావం ఉన్న సమంత తనకి అనారోగ్యంగా ఉన్న సమయంలో కూడా సినిమా కోసం పనిచేసింది. తాజాగా శాకుంతలం సినిమాకి డబ్బింగ్ చెప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తాజాగా శాకుంతలం సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్లో సమంత మీడియా ముందుకు రావడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలం తర్వాత సమంతని ఇలా చూడటం తో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతు వెల్కమ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొంతమంది మాత్రం ఆమె లుక్స్‌ గురించి నెగెటివ్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ ‘సమంతను చూస్తే జాలిగా ఉంది. ఆమె అందం బాగా తగ్గిపోయింది. విడాకుల తర్వాత ఆమె కెరీర్‌లో ఉన్నతస్థానంలో ఉంటుందని భావిచారు. మయోసైటిసిస్ ఆమెను మళ్లీ దెబ్బతీసింది. సామ్‌ను మళ్లీ బలహీనురాలిని చేసింది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే తన గ్లామర్ గురించి ట్రోల్ చేస్తున్న వారికి సామ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

సదరు నెటిజన్ చేసిన ట్వీట్ కి స్పందిస్తూ.. ‘నా లాగా కొన్ని మాసాల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు రాకూడదని గట్టిగా కోరుకుంటున్నా. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కూడా కొంచెం పంపిస్తున్నా’ అంటూ సమంత స్ట్రాంగ్‌ కౌంటరిచ్చింది . ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంలో సమంత అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా సమంతని సపోర్ట్ చేస్తూ సదరు నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus