మోహన్ బాబు (Mohan Babu ) సినిమాల్లోకి అడుగుపెట్టి నేటితో అంటే 2024 నవంబర్ 22 కి 50 ఏళ్ళు పూర్తయ్యింది. 600 కి పైగా సినిమాలు, వైవిధ్యమైన పాత్రలు, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్.. వీటి కలయికతో మోహన్ బాబు స్టార్ అయ్యారు. ‘అల్లూరి సీతారామరాజు’ ‘కన్నవారి కలలు’ సినిమాలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు.. దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గం నరకం’ సినిమాతో గుర్తింపు పొందారు. ఆ తర్వాత వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో విలన్ గా, సహాయ నటుడిగా, మరో హీరోగా… చేసుకుంటూ ముందుకు సాగారు.
Mohan Babu
విలన్ గా చేసినప్పటికీ కూడా హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఘనత మోహన్ బాబు సొంతం. విలన్ గా పెద్ద హీరోల సినిమాల్లో నటించడం, అలాగే మిగిలిన హీరోలతో కలిసి నటించడం వల్ల.. మాస్ ఆడియన్స్ లో ఈయనకి మంచి గుర్తింపు లభించింది. అందువల్ల సోలో హీరోగా కూడా మారి సినిమాలు చేయడానికి మోహన్ బాబు రెడీ అయ్యారు. 1990 ల టైంలో చిరంజీవి (Chiranjeevi),బాలకృష్ణ (Nandamuri Balakrishna), నాగార్జున (Nagarjuna), వెంకటేష్ (Venkatesh Daggubati) వంటి స్టార్ హీరోలు దూసుకుపోతున్న టైంలో మోహన్ బాబు సోలో హీరోగా మారి ‘అల్లుడు గారు’ ‘అసెంబ్లీ రౌడీ’ ‘పెదరాయుడు’ ‘అల్లరి మొగుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు.
అయితే మోహన్ బాబు సోలో హీరోగా మారుతున్న రోజుల్లో ఓ స్టార్ హీరో.. ఒక స్టార్ డైరెక్టర్ కి ‘నువ్వు ఫామ్లో ఉన్నావ్, స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నావు. ఇలాంటి టైంలో హీరోగా మార్కెట్ లేని మోహన్ బాబుతో సినిమా అవసరమా?’ అంటూ మోహన్ బాబుని తక్కువ చేసి మాట్లాడాడట. దీంతో ఆ దర్శకుడు.. ‘డైరెక్టర్ టాలెంట్ అనేది కంటెంట్ ను బట్టి ప్రూవ్ అవుతుంది కానీ హీరో ఇమేజ్ తో కాదు’ అంటూ పర్సనల్ గా తీసుకుని ఆ స్టార్ హీరోకి సున్నితంగా బదులిచ్చాడట.
తర్వాత మోహన్ బాబుతో ఆ స్టార్ డైరెక్టర్ తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత కూడా మోహన్ బాబుని హీరోగా పెట్టి ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలు చేశారు. అవి కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. అలా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకి కూడా మోహన్ బాబు గట్టి పోటీ ఇచ్చారు. ‘పెదరాయుడు’ వంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టారు.