కేసు నుంచి బయటపడ్డ సీనియర్ హీరో!

లైంగిక వేధింపుల కేసులో సీనియర్ నటుడు అర్జున్‌ సర్జాకు క్లీన్‌ చిట్‌ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌ పై ఆరోపణలు కొట్టివేస్తూ.. బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్‌ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకి సంబంధించిన విచారణ ఇప్పటివరకు కొనసాగింది. అసలేం జరిగిందంటే.. కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం ‘నిబుణన్‌’ సెట్స్‌లో హీరో అర్జున్ తనపై లైంగిక వేధింపుల‌కు పాల్పడ్డాడని..

నటి శృతి హరిహరన్ ఆరోపణలు చేసింది. సెట్‌లో ఓ రొమాంటిక్‌ సీన్‌ రిహార్సల్స్‌లో భాగంగా అర్జున్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని.. ఒక పాట సన్నివేశంలో అర్జున్‌ తనను గట్టిగా హత్తుకుని, అభ్యంతరకరంగా తడిమారని శృతి ఆరోపించింది. ఆ సమయంలో అర్జున్ ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యారు. శృతి చేసే ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నాన‌ని, 150 సినిమాల్లో నటించాన‌ని, దాదాపు 60 మంది హీరోయిన్స్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నానని..

వారందరితో మంచి స్నేహం ఉంద‌ని.. అలాంటిది త‌న‌పై శ్రుతి ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తోందో అర్థం కావడం లేదని అప్పట్లో అర్జున్ వాపోయారు. ఫైనల్ గా ఈ కేసులో అతడికి విముక్తి లభించింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus